రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది సిరిసిల్ల సబ్ కోర్టులో అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమితులైన పసుల కృష్ణ ను నాయకులు శాలువా కప్పి సన్మానించారు.నాయకులు మాట్లాడుతూ.
ఏజీపీగా నియమితులైనందుకు సంతోషం వ్యక్తం చేస్తూ.భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని న్యాయం కోసం పోరాడి,పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య,రజక సంఘం రాష్ట్ర కన్వీనర్ లోకుర్తి బాలమల్లు,ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు కంచర్ల నర్సింలు,కోరుట్ల పేట గ్రామ తాజా మాజీ సర్పంచ్ మేడిపల్లి దేవనందం, బత్తుల బాబు, సుడిది రాజేందర్ పాల్గొన్నారు.