రేపటితో ముగియనున్న జగన్ బస్సు యాత్ర... చివరి రోజు షెడ్యూల్..!!

వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) చేపట్టిన "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర జోరుగా సాగుతోంది.

మార్చి నెల చివరిలో ఇడుపులపాయల ప్రారంభమైన బస్సు యాత్ర.

రేపు ఇచ్చాపురంలో ముగియనుంది.ఈ క్రమంలో బస్సు యాత్ర చివరి రోజు షెడ్యూల్ సీఎంవో కార్యాలయం విడుదల చేయడం జరిగింది.

బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు అక్కివలస.రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభం కానుంది.

ఎచ్చెర్ల, కుశలాపురం, శ్రీకాకుళం బైపాస్, పలివలస, నరసన్నపేట క్రాస్, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పశురాంపురం చేరుకుంటారు.మధ్యాహ్నం 12 గంటలకు పశురాంపురం జంక్షన్( Pashurampuram Junction ) వద్ద సీఎం జగన్ విరామం తీసుకుంటారు.

Advertisement

అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు లంచ్ క్యాంపు నుంచి అక్కవరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు బయలుదేరుతారు.సాయంత్రం 4:20 నిమిషాలకు.సభ ప్రాంగణానికి చేరుకుంటారు.5:20 వరకు సభలో ప్రసంగించనున్నారు.ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అక్కవరం హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు.

అక్కడ నుంచి హెలికాప్టర్ లో విశాఖపట్నం విమానాశ్రయానికి వెళ్ళనున్నారు.సాయంత్రం 6:15 నిమిషాలకు విశాఖపట్నం విమానాశ్రయంకు చేరుకొనున్నారు.6:30 గంటలకు విశాఖపట్నం నుంచి గన్నవరం విమానాశ్రయంకు వెళ్లనున్నారు.7:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు