Jabardasth, Emmanuel :కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. కారు ఖరీదెంతంటే?

జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తక్కువ కాలంలోనే మంచి కమెడియన్ గా పేరును సొంతం చేసుకుని ఇతర ఛానెళ్ల నుంచి ఆఫర్లు వస్తున్నా ఈటీవీ ఛానెల్ కే పరిమితమై మంచి పేరు సొంతం చేసుకున్నారు.

టాలెంట్ తో కమెడియన్ గా తన స్థాయిని పెంచుకున్న ఇమ్మాన్యుయేల్ వర్షతో కలిసి చేసిన స్కిట్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోలో ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ కూడా పెరిగిందని బోగట్టా.ఇమ్మాన్యుయేల్ ఈవెంట్లు కూడా చేస్తుండగా ఆ ఈవెంట్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.

తను సంపాదించిన డబ్బుతో ఇమ్మాన్యుయేల్ తాజాగా కొత్త కారును కొనుగోలు చేయగా ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియా ద్వారా ఆ ఫోటోలను పంచుకున్నారు.ఇమ్మాన్యుయేల్ కొనుగోలు చేసిన కొత్త కారు ఖరీదు 14 లక్షల రూపాయలు అని తెలుస్తోంది.

ఇమ్మాన్యుయేల్ సినిమాలపై కూడా దృష్టి పెట్టాలని మరి కొందరు సూచిస్తున్నారు.ఇమ్మాన్యుయేల్ మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు కావడంతో ఆయన సినిమా రంగంలో కూడా సులువుగానే సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

Advertisement

హ్యుందాయ్ వెన్యూ మైక్రో ఎస్‌యూవీ కారును ఇమ్మాన్యుయేల్ కొనుగోలు చేశారు.హై ఎండ్ వేరియంట్ ను ఇమ్మాన్యుయేల్ కొనుగోలు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇమ్మాన్యుయేల్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇమ్మాన్యుయేల్ ఈటీవీ ప్లస్ ఛానల్ లో ప్రసారమయ్యే పలు కామెడీ షోలలో కూడా పాల్గొని సందడి చేస్తున్నారు.ఆ ప్రోగ్రామ్స్ కూడా ఇమ్మాన్యుయేల్ కు మంచి పేరును తెచ్చిపెడుతున్నాయి.ఇమ్మాన్యుయేల్ కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కమెడియన్ గా ఇమ్మాన్యుయేల్ కు ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు