ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం అవతార్ 2.ఈ సినిమా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేస్తుందనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.
మొదటి అవతార్ విడుదలై 13 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటికీ ఆ సినిమా అంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే.అంతకు మించి ఈ సినిమా ఉంటుందనే నమ్మకాన్ని దర్శకుడు జేమ్స్ కామెరూన్ కలిగిస్తున్నాడు.
అందుకే ఈ సినిమా ను తెలుగు లో 100 కోట్ల రూపాయల రిలీజ్ బిజినెస్ చేసినందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా సమాచారం అందుతుంది.
ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఈ సినిమా ను మరో నిర్మాత తో కలిసి కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నాడట.
ఆ ప్రముఖ నిర్మాత దిల్ రాజు అని, మరో నిర్మాత అల్లు అరవింద్ అని సమాచారం అందుతుంది.వీరిద్దరూ కలిసి 100 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినందుకు రెడీగా ఉన్నారట.
అవతార్ 2 సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా కనుక కచ్చితంగా 100 కోట్ల రూపాయలను తెలుగు రాష్ట్రాల్లో రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు అని దిల్ రాజు మరియు అల్లు అరవింద్ ఈ సినిమా ను తీసుకున్నారంటూ అవార్తలు వస్తున్నాయి.వీరిద్దరు ఒక సినిమాను తీసుకోవాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు.
ఆ సినిమా వర్కౌట్ అవుతుంది అనుకుంటేనే ముందడుగు వేస్తారు.వారిద్దరూ ఇప్పటికే ఆ సినిమా ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుకున్నట్లుగా తెలుస్తోంది.కనుక వారిద్దరి నమ్మకం ప్రకారం 200 కోట్ల రూపాయలను అవతార్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేస్తుందట, అందుకే 100 కోట్ల రూపాయలను పెట్టేందుకు నో ప్రాబ్లం అన్నట్లుగా వారు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.ఇందులో నిజం ఎంత తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.






