సినిమా రంగంలో నిర్మాతగా సక్సెస్ కావాలంటే సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకోవడంతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి.శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై దిల్ రాజు పలు సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మించగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.
దిల్ సినిమాతో నిర్మాతగా కెరీర్ మొదలుకావడంతో ఈ నిర్మాత పేరు దిల్ రాజుగా మారింది.దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత కాగా రెండో భార్య పేరు వైఘా రెడ్డి(తేజస్విని) అనే అంగతి తెలిసిందే.
దిల్ రాజు వైఘారెడ్డి దంపతులకు ఒక కొడుకు కాగా దిల్ రాజు కొడుకుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దిల్ రాజు కొడుకు క్యూట్ గా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా తల్లి వైఘారెడ్డి కంటే తండ్రి దిల్ రాజు పోలికలు కొడుకుకు ఎక్కువగా వచ్చాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.50 సంవత్సరాల వయస్సులో దిల్ రాజు కొడుకుకు తండ్రి కావడం గమనార్హం.
వారసుడు మూవీ షూటింగ్ లో స్టార్ హీరో విజయ్ దిల్ రాజు కొడుకుని ఎత్తుకుని ఫోటోలు దిగగా ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు భవిష్యత్తులో దిల్ రాజు కొడుకుని హీరోను చేస్తారో లేక నిర్మాతను చేస్తారో అంటూ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.చాలామంది నిర్మాతల కొడుకులు హీరోలు కావడంతో దిల్ రాజు కొడుకు భవిష్యత్తులో ఏమవుతారో చూడాలి.

వారసుడు మూవీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుండగా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు వంశీ పైడిపల్లి గత సినిమాలను గుర్తు చేస్తున్నాయి.మున్నా మినహా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించాయి.అయితే ఈ సినిమా పోస్టర్లు బృందావనం, మహర్షి సినిమాలను గుర్తు చేస్తుండటం కొంతమంది ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది.







