టిడిపిని కాపాడేది బ్రాహ్మణియే..సీఎం అర్హతలున్నాయా..?

తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు ( Nara Chandrababu Naidu ) స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై జైలులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

ఆయన జైలుకు వెళ్లినప్పటి నుంచి ఏపీలో టిడిపి వర్గాలు అట్టుడికి పోతున్నాయి.

అంతేకాకుండా నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తూ మా అభిమాన నాయకుడిపై లేనిపోని ఆరోపణలు చేశారంటూ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు.కేవలం ఏపీలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరులో కూడా చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తూ అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇదంతా ఓకేత్తయితే, ఇక టిడిపి నాయకులకు, కార్యకర్తలకు నారా లోకేష్,బాలకృష్ణ ( Balakrishna ) అండగా నిలబడుతూ ముందుకు సాగుతున్నారు.ఇదే తరుణంలో మరో వార్త బయటకు వచ్చింది.

It Is Brahmani Who Will Save Tdp..does The Cm Have The Qualifications , Nara Br

త్వరలో లోకేష్ ( Lokesh ) కూడా అరెస్ట్ అవుతారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి.ఇదే తరుణంలో టిడిపి వర్గాల్లో ఆందోళన నెలకొంది.లోకేష్ కూడా అరెస్ట్ అయితే టిడిపిని ముందుకు నడిపించేది ఎవరు అనే విషయంలో నైరాష్యం నెలకొంది.

Advertisement
It Is Brahmani Who Will Save TDP..Does The CM Have The Qualifications , Nara Br

టిడిపిని కాపాడడం బాలకృష్ణ వల్ల కాదని ఇప్పటికే అనేక వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే రంగంలోకి దిగుతోంది నారా బ్రాహ్మణి. రాజకీయ కుటుంబానికి చెందినటువంటి బ్రాహ్మణి ఇన్ని రోజులు బిజినెస్ లు, కుటుంబ వ్యవహారాలు తప్ప రాజకీయాల్లో అస్సలు కనిపించలేదు.

కానీ తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చి అద్భుతంగా మాట్లాడింది.సీనియర్ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ను అరెస్ట్ చేయడం దారుణమని, మేము ఒంటరి వాళ్లం కాదని టిడిపి నాయకులంతా మా కుటుంబ సభ్యులు అంటూ మాట్లాడింది.

ఈ విధంగా నారా బ్రాహ్మణి ( Nara Brahmini ) మాట్లాడడంతో ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి బ్రాహ్మణి రావాలని అనేకమంది టిడిపి నాయకులు కోరుకుంటున్నారు.

It Is Brahmani Who Will Save Tdp..does The Cm Have The Qualifications , Nara Br

ఈ క్రమంలోనే టిడిపి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ( Ayyannapatrudu ) చంద్రబాబు తర్వాత లొకేష్ ను కూడా అరెస్టు చేస్తారేమో అని జోష్యం చెప్పారు.ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం అది జరిగేలా కనిపిస్తోంది.అలాంటి సమయంలో టిడిపి పగ్గాలు పట్టుకునే శక్తి నారా బ్రాహ్మణికి ఉందని, టిడిపి వర్గాలు చర్చించుకుంటున్నాయి.

స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!
అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

ఆమె కేవలం కుటుంబం, బిజినెస్ లు కాకుండా, తన తాత నందమూరి తారక రామారావు( Nandamuri Tarakaramarao ) , మామ చంద్రబాబు నాయుడి లాగా సమయానికి తగ్గట్టు వ్యవహరించే సమయస్ఫూర్తి,రాజకీయ చతురత ఆమెలో ఉన్నాయని, టిడిపి పార్టీని ఆమె ముందుకు తీసుకెళ్లే శక్తి ఉందని భావిస్తున్నారు.అంతేకాకుండా సీఎం పోస్టుకు కూడా ఆమె ఏం తక్కువ కాదని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు