అది శ్రీనివాస్ కె మా మద్దతు పటేల్స్ యూత్ ఏకగ్రీవ తీర్మానం..

రాజన్న సిరిసిల్ల జిల్లా: వచ్చే ఎన్నికల్లో తమ ఓటు వేములవాడ కాంగ్రెస్ పార్టీ( Congress party ) అభ్యర్థి అది శ్రీనివాస్ కె వేసి ఎమ్మెల్యే గా గెలిపించుకుంటాం అని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పటేల్స్ యూత్ సంఘ సభ్యులు బుధవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుద్రంగి మున్నూరుకాపు ముద్దుబిడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి అదిశ్రీనివాస్( Adi Srinivas ) పూర్తి మద్దతు తెలుపుతూ రుద్రంగి పటేల్స్ యూత్ ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగిందని అన్నారు.

గెలుపులో ప్రతి ఒక్కరు కృషిచేయాలని కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్న అది శ్రీనివాస్ ను ఈసారి అసెంబ్లీకి పంపిస్తామని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందన్నారు.యూత్ సభ్యులంతా కలిసి బూత్ లెవెల్ లో కృషిచేయడానికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రతిజ్ఞ చేసారు.

It Is A Unanimous Resolution Of Srinivas K Ma Support Patel's Youth..-అద

ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News