గగన్‎యాన్ ప్రయోగానికి ఇస్రో సిద్ధం

చంద్రయాన్ -2 ప్రయోగం సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ లో ఉన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగానే తొలిసారిగా మానవ సహిత ప్రయోగానికి ఇస్రో ఇప్పటికే సిద్ధం అయింది.

ఈ మేరకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని మొదటి రాకెట్ ప్రయోగ వేదికను సిద్దం చేశారని తెలుస్తోంది.గగన్‎యాన్ ప్రయోగానికి ఇవాళ రాత్రి 7.30 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుండగా సుమారు 12.30 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగనుంది.రేపు ఉదయం 8 గంటలకు గగన్ యాన్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

గగన్ యాన్ ప్రయోగం ద్వారా క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టంను భూమికి 17 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్లి ప్యారాచూట్ల సాయంతో తిరిగి భూమికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ ప్రయోగం విజయవంతం అయితే భవిష్యత్తులో మానవ సహిత ప్రయోగాలు చేసేందుకు ఇది మొదటి అడుగు అవుతుందని సమాచారం.

వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..
Advertisement

తాజా వార్తలు