అక్కినేని నాగార్జున దర్శకత్వం లో తెరకెక్కిన ఏకైక సినిమా అదేనా..?

అక్కినేని నాగేశ్వర రావు( Akkineni Nageswara Rao ) గారి కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగార్జున( Nagarjuna ), తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకోవడం కోసం మొదటి సినిమా నుండే ఎంత కష్టపడ్డాడో మనమంతా చూస్తూనే ఉన్నాం.

మన టాలీవుడ్ లో అత్యధిక ప్రయోగాలు చేసి అధిక శాతం సక్సెస్ లు చూసిన ఏకైక హీరో ఒక్క నాగార్జున మాత్రమే.

క్లాస్ , మాస్ , డివోషనల్, లవ్ స్టోరీస్, కామెడీ ఎంటెర్టైనెర్స్, యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్స్, ఫ్యామిలీ డ్రామాస్, యాక్షన్ మూవీస్ ఇలా ఎన్ని జానర్స్ అయితే ఉంటాయో, అన్నీ జానర్స్ లో కూడా సక్సెస్ లను చూసిన ఏకైక హీరో ఆయన.తెలుగు ఆడియన్స్ తో పాటుగా, హిందీ మరియు తమిళ ఆడియన్స్ లో కూడా నాగార్జున కి విపరీతమైన క్రేజ్ ఉంది.ఒక్కమాటలో చెప్పాలంటే అప్పట్లో మన టాలీవుడ్ నుండి పాన్ పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ హీరో అన్నమాట.

Is That The Only Film Directed By Akkineni Nagarjuna , Akkineni Nageswara Rao,

కేవలం నటుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా మరియు ఒక్క పెద్ద వ్యాపారవేత్తగా నాగార్జున సక్సెస్ లను చూసాడు, ఇంకా చూస్తూనే ఉన్నాడు.ప్రస్తుతం మన టాలీవుడ్ అత్యధిక మూవీస్ షూటింగ్స్, ఎంటర్టైన్మెంట్ షోస్ షూటింగ్స్ మరియు సీరియల్స్ షూటింగ్స్ ఇవన్నీ జరిగేవి అన్నపూర్ణ స్టూడియోస్( Annapurna Studios ).అంత పెద్ద స్టూడియోస్ ని మైంటైన్ చేస్తున్నది నాగార్జున మాత్రమే.ఇదంతా పక్కన పెడితే నాగార్జున దర్శకుడిగా కూడా ఒక సినిమాకి పని చేసాడు అనే విషయం చాలా మందికి తెలియదు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే నాగార్జున కెరీర్ లో అప్పట్లో సంతోషం అనే సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.ఫ్యామిలీ ఆడియన్స్ లో నాగార్జున రేంజ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది ఈ చిత్రం.

Advertisement
Is That The Only Film Directed By Akkineni Nagarjuna , Akkineni Nageswara Rao,

ఈ సినిమాకి దర్శకుడిగా దశరద్ వ్యవహరించాడు.మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో చాలా కాలం తర్వాత గ్రీకు వీరుడు( Greekuveerudu ) అనే సినిమా వచ్చింది.

Is That The Only Film Directed By Akkineni Nagarjuna , Akkineni Nageswara Rao,

ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని తీసిన తర్వాత దశరధ్ చేసిన చిత్రమిది.మంచి అంచనాల నడుమ విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఈ చిత్రం.ఈ సినిమా షూటింగ్ సమయం లో మధ్యలో దశరధ్ కి కాస్త అస్వస్థత ఏర్పడింది అట.షూటింగ్ మధ్యలో ఆగిపోతే నయనతార తో పాటుగా, సినిమాలో పనిచేస్తున్న మిగతా పెద్ద ఆర్టిస్టుల డేట్స్ మిస్ అవుతాయి.రెండు మూడు నెలల వరకు షూటింగ్ ని ఆపేయాల్సి వస్తుంది.

అందుకే నాగార్జున నే చాలా వరకు షూటింగ్ ని పూర్తి చేసాడట.అలా నాగార్జున కెరీర్ లో మొట్టమొదటిసారి దర్శకత్వం వహించిన సినిమా ఇదేనని ఒక టాక్ ఉంది.

అనుభవం లేకుండా నాగార్జున దర్శకత్వం వహించడం వల్లే ఈ చిత్రం ఫ్లాప్ అయ్యిందని అప్పట్లో అనుకునేవారు.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు