తెలుగు సినిమాల్లో ఒకప్పుడు నటుడి గా మంచి గుర్తింపు పొందిన వాళ్లలో కిక్ శ్యామ్( Kick Sham ) ఒకరు… ఈయన ప్రస్తుతం తెలుగు లో ఏ సినిమాలో కూడా మనకు కనిపించడం లేదు.ఆయన మిగితా భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు.
ఇక తెలుగులో ఆయన నటించకపోవడానికి కారణం ఆయనకు మంచి ఆఫర్స్ రావట్లేదు.ఇక దాంతో పాటుగా ఆయనకి ఇక్కడ దర్శకులు పెద్దగా మంచి క్యారెక్టర్స్ ని ఆఫర్ చేయడం లేదు.
అందుకే ఆయన తెలుగులో సినిమాలు చేయట్లేదని తెలుస్తుంది.ఇక ఈయన సురేందర్ రెడ్డి ( Surender Reddy )డైరెక్షన్ లో వచ్చిన కిక్ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక ఆ తర్వాత వరుసగా చాలా సినిమాల్లో నటించినప్పటికీ ప్రస్తుతం ఆయనకి ఆఫర్స్ ఏమి రాకపోవడంతో తెలుగు సినిమాలకి దూరం గా ఉంటూ వస్తున్నారు.అయితే ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు( Ram Charan ,Buchibabu ) కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం కిక్ శ్యామ్ ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.ఇది మా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న సినిమా కావడం తో ఈ సినిమాలో కిక్ శ్యామ్ ఉంటే బాగుంటుందని బుచ్చిబాబు అనుకుంటున్నట్టు గా తెలుస్తుంది.

ఇక బుచ్చిబాబు ఈ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు అందరిని సెట్ చేసి పెడుతున్నాడు సెట్స్ మీదకి వెళ్ళడమే బ్యాలెన్స్ అనే రేంజ్ లో ఈ సినిమాకి హైప్ అయితే వస్తుంది.ఇక ఎప్పుడు షూటింగ్ కి వెళ్తుందో అప్పటినుంచి ఫాస్ట్ గా సినిమాను షూట్ చేసి తొందరగా సినిమా రిలీజ్ చేయాలనే ఆలోచన బుచ్చిబాబు ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో అందరు ఆర్టిస్ట్ లను సెలెక్ట్ చేసినప్పటికీ హీరోయిన్ ని మాత్రం ఎవరు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
అయితే సినిమా లో హీరోయిన్ గా ఎవరిని తీసుకోబోతున్నారు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయకు తప్పదు.








