Srikanth : గేమ్ చేంజర్ సినిమాతో శ్రీకాంత్ లైఫ్ మారబోతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది నటులు ఉన్నప్పటికీ ఒకప్పటి సీనియర్ నటుడు అయిన శ్రీకాంత్( Srikanth ) కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.

అయిన హీరోగా చేస్తున్న సమయంలో కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే సినిమాలు ఎక్కువగా చేసేవారు.

అలాగే ఆయన వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ వరుస సినిమాలను చేస్తూ వాటిని సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్లాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కామెడీ సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా ఎక్కువగా అలరిస్తూ వచ్చాడు.

ముఖ్యంగా ఇ వి వి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి ( S V Krishna Reddy )లాంటి స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడం ఆయన చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.అయితే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈయన లైఫ్ టర్న్ అవబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఎందుకంటే శ్రీకాంత్ ఈ సినిమాలో చాలా కీలకపాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఆ పాత్ర వల్లే ఆయనకి సినిమాల్లో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని సినిమా యూనిట్ నుంచి సమాచారం అయితే వస్తుంది.

Advertisement

అందుకే ఆయన వేరే సినిమాలకు డేట్స్ ఇవ్వకుండా ఈ సినిమా కోసమే చాలా డేట్స్ ని కేటాయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఇప్పటికే శ్రీకాంత్ పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించినప్పటికీ, ఆయనకు పెద్దగా గుర్తింపైతే రాలేదు.కానీ ఈ సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

చూడాలి మరి ఈ సినిమా శ్రీకాంత్ కెరియర్ కి ఎంతలా ప్లస్ అవుతుందో.ఇక ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకునే మాత్రం శ్రీకాంత్ కూడా మరో జగపతి బాబు లా రాణిస్తాడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Advertisement

తాజా వార్తలు