బిర్యాని తింటుంటే మధ్యలో ఇనుప తీగ,రెస్టారెంట్ పై జరిమానా

బిర్యానీ లో ముక్కలు దొరకడం సహజం.

అయితే ఒక యువకుడు ఆర్డర్ చేసిన బిర్యానీ లో మాత్రం ముక్కల సంగతి పక్కన పెడితే, ఇనుప తీగ వచ్చింది.

ఇక అంతే దెబ్బకు రెస్టారెంట్ కు జరిమానా విధించారు.ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి లో చోటుచేసుకుంది.

ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.కూకట్ పల్లి కి చెందిన శ్రీనివాస్ జొమాటో బృందానికి బిర్యానీ,కర్డ్ రైస్ ఆర్డర్ చేశాడు.

అయితే శ్రీనివాస్ ముందుగా బిర్యానీ తింటుండగా ఉన్నట్టుండి పంటికిందకు గట్టిగా తగిలింది.తీరా ఏంటా అని తీసి చూడగా ఇనుప తీగ దర్శనమిచ్చింది.

Advertisement

దీనిపై జోమాటో టీంకు శ్రీనివాస్ ఫిర్యాదు చేయగా వారు అతనికి క్షమాపణలు చెప్పి, డిస్కౌంట్ కూపన్ ఇచ్చారు.అనంతరం శ్రీనివాస్ జీహెచ్ఎంసీ యాప్ ద్వార ట్విట్టర్‌లో బిర్యానీ విక్రయించిన రెస్టారెంట్‌పై ఫిర్యాదు చేశారు.

దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కూకట్ పల్లిలోని రాజా వారి రుచులు రెస్టారెంట్‌ లో తనిఖీలు చేసి ఐదువేల రూపాయల జరిమానా విధించినట్లు తెలుస్తుంది.బిర్యానీలో ఇనుపతీగ వచ్చిన ఘటనపై తాను వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని శ్రీనివాస్ చెప్పారు.

కాగా దీనిపై తాము తగిన చర్యలు తీసుకుంటామని జోమాటో పేర్కొంది.

జీవీ ప్రకాష్ సైంధవి విడిపోవడానికి కారణాలివే.. ఆ రీజన్ వల్లే విడిపోతున్నారా?
Advertisement

తాజా వార్తలు