అరెరే.. ఆ బావిలోని నీటిని తాగితే డాక్టర్ అవసరమే లేదంట..!

మన దేశంలో ఆలయాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.ఒక్కో ఊరిలో ఒక్కో ఆలయానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు.

ఆ ఊరిలో ఉండే భక్తులు ఆ దేవాలయంలో కొలువై ఉన్న దేవుడిని ఎంతో భక్తి శ్రద్దలతో కొలుస్తూ ఉంటారు.అలా భక్తుల నమ్మకమే ఆయా ఆలయాల ప్రాముఖ్యతను పెంచుతూ వస్తుంది.

ఒక్కో ఊరిలో ఒక్కో దేవుడిని కొలుస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలోనే నెల్లూరు నగరంలోని వైద్య వీర రాఘవ స్వామి దేవస్థానం కూడా బాగా పేరు గాంచింది.

మరి ఆ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందామా.నెల్లూరు జిల్లాలోని దర్గామిట్ట, రామ్ నగర్ పరిధిలో ఈ ఆలయం ఉంది.

Advertisement
Interesting Facts About Nellore Vaidya Veera Raghava Swamy Temple Well Water Det

ప్రతి శనివారం, అమావాస్య రోజుల్లో ఈ గుడికి భక్తులు పోటెక్కుతారు.అలాగే ఈ దేవాలయంలోని వేమాల శెట్టి బావి చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి.

ఆలయం ఆవరణలోనే ఈ బావి ఉంటుంది.ఆలయానికి వచ్చేవారు ఈ బావిలో బెల్లం వేస్తే తమ ఆరోగ్యం మెరుగు పడుతుందని భావిస్తారు.

కోరిన కోర్కెలు నెరవేరాయని ఈ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు అమావాస్య రోజున ఇక్కడికి వస్తుంటారు.ఇంతకీ ఈ ఆలయ చరిత్ర ఏంటో ఒకసారి తెలుసుకుందామా.

నెల్లూరులో గల వైద్య వీర రాఘవ స్వామి ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది.

Interesting Facts About Nellore Vaidya Veera Raghava Swamy Temple Well Water Det
ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవుతుంది!

ఆ రోజుల్లో వేమాలమ్మ, వేమాల శెట్టి అనేవారు ఈ ఆలయం కట్టాలని, అక్కడే బావి తవ్వేందుకు ప్రయత్నం చేశారట కానీ ఎంతకీ ఆ బావి కట్టడం పూర్తి అవ్వడం లేదట.అయితే ఒకరోజు కలలో వైద్య వీర రాఘవ స్వామి వారు ప్రత్యక్షమయ్యి వారు జలసమాధి అయ్యారని, అక్కడే బావి ఏర్పడిందని చెబుతారు.అలాగే ఈ ఆలయంలోని పీఠంపై ఉప్పు, మిరియాలు వేసి దేవుడికి మొక్కుకుంటారు భక్తులు.

Advertisement

ముఖ్యంగా మహిళలు ఇక్కడ బెల్లం సమర్పించి కోర్కెలు కోరుకుంటారు.ఆరోగ్యం బాగు అయ్యాక మళ్ళీ తప్పకుండా వస్తారట.

" autoplay>

తాజా వార్తలు