హనుమంతుడి కొడుకు ఎవరు.. అతనిని ఆంజనేయుడు ఎలా గుర్తించాడో తెలుసా?

ఆంజనేయ స్వామిని సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమని భావిస్తారు.పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి వాయు దేవుడి వరంతో అంజని మరియు కేసరి దంపతులకు జన్మించాడు.

 Unnown Facts About Lord Hanuman Son Makardhwaja, Lord Hanuman Son , Hanuman, Ra-TeluguStop.com

అందుకోసమే ఆంజనేయస్వామిని వాయుపుత్రుడు, పవనసుతుడు అని కూడా పిలుస్తారు.అయితే ఆంజనేయ స్వామిని బ్రహ్మచారిగా మనం పూజించడం చూస్తుంటాము.

కానీ బ్రహ్మచారిగా పేరు పొందిన ఆంజనేయ స్వామికి ఒక కొడుకు ఉన్నాడు అనే విషయం చాలా మందికి తెలియదు.అసలు ఆంజనేయుడి కొడుకు ఎవరు? అతని జన్మ రహస్యం ఏమిటి?ఆంజనేయుడు తన కొడుకుని ఏ విధంగా గుర్తించాడు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

రామాయణం ప్రకారం సీత అన్వేషణ కోసం ఆంజనేయుడు లంకకు బయలుదేరుతాడు.లంకకు వెళ్ళిన ఆంజనేయుడు మాటలు నచ్చని రావణాసురుడు అతని సైన్యానికి చెప్పి ఆంజనేయుడి తోకకు నిప్పంటించారు.ఈ క్రమంలోనే ఆంజనేయుడు తన తోకతో లంకకు మొత్తం నిప్పు పెట్టాడు.

ఈ క్రమంలోనే లంక నుంచి తిరుగు ప్రయాణంలో ఆ వేడి నుంచి ఉపశమనం కోసం ఆంజనేయస్వామి సముద్రంలో మునిగి కాసేపు సేద తీరాలని భావిస్తాడు.ఆ విధంగా ఆంజనేయుడు సముద్రంలో మునగగానే అతని శరీరం నుంచి వెలువడిన ఒక స్వేదబిందువు జలకన్య నోటిలోకి ప్రవేశించడంతో ఆమె గర్భం దాలుస్తుంది.

ఈ విషయం గ్రహించిన హనుమంతుడు సముద్రం నుంచి వెళ్ళిపోతాడు.

Telugu Hanuman, Hanuman Son, Lanka, Lord Rama, Makaradwajudu, Ramayana, Ramayana

కొద్ది రోజుల తరువాత పాతాళ రాజు మైరావణుడి భటుల వలలో ఆ జలకన్య చిక్కుతుంది.మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను భటులు రాజు వద్దకు తీసుకు వెళ్తారు.ఈ క్రమంలోనే ఆ జలకన్య పొట్టకోసి చూసినప్పుడు అందరూ ఎంతో ఆశ్చర్యపోతారు.

ఆ జల కన్య గర్భంలో శిశువు సగభాగం కోతిని సగభాగం చేపను పోలి ఉంటాడు.ఈ విధంగా రెండు రూపాలు కలిగి ఉన్నటువంటి ఆ జీవికి  ‘మకరధ్వజురడు’ అని నామకరణం చేశారు.

అదేవిధంగా అతనిని ద్వారకా పాలకుడిగా నియమించుకున్నాడు.సీత కోసం యుద్ధం చేయాల్సిన సమయంలో రావణాసురుడు రామలక్ష్మణులను బంధించి మైరావణుడి కోటలో బంధించాడు.

Telugu Hanuman, Hanuman Son, Lanka, Lord Rama, Makaradwajudu, Ramayana, Ramayana

ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయుడు రామలక్ష్మణులను విడిపించడం కోసం మైరావణపురానికి చేరుకుంటాడు.అక్కడ మకరధ్వజునితో హనుమంతుడు తలపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.ఈ క్రమంలోనే మకరధ్వజుని బల పరాక్రమాలను చూసి ఆశ్చర్యపోయిన హనుమంతుడు నీవు ఎవరి పుత్రుడు అని ప్రశ్నిస్తాడు.అందుకు మకరధ్వజుడు హనుమంతుడు పుత్రుడు అని చెప్పగానే ఆశ్చర్యపోయిన ఆంజనేయుడు తను బ్రహ్మచారి అని చెప్పి జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటాడు.

అప్పుడే అతడికి తన స్వేదబిందువు జలకన్య నోటిలోకి పోవడం ద్వారా మకరధ్వజుడు జన్మించాడని భావించి అతనిని ఆలింగనం చేసుకొని ఎంతో పరవశించి పోతాడు.మైరావణుని సంహరించి రామలక్ష్మణులను విడిపించడమే కాకుండా మకరధ్వజుడునీ పాతాళానికి అధిపతిగా చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube