ఆస్ట్రేలియాలో ఆగని ఖలిస్తాన్ మద్ధతుదారుల ఆగడాలు.. మరోసారి హిందూ ఆలయం టార్గెట్

ఖలిస్తాన్ ప్రత్యేక రాజ్యం కోసం ఏళ్లుగా పోరాడుతున్న కొందరు అతివాదుల ఆగడాలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి.ఇప్పటి వరకు కెనడా కేంద్రంగా తమ కార్యకలాపాలు నిర్వహించిన కొన్ని సిక్కు వేర్పాటువాద సంస్థలు .

 Iskcon Temple Inaustralia Defaced With Anti-india Graffiti , Iskcon Temple , Kha-TeluguStop.com

ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ దుశ్చర్యలకు పాల్పడుతున్నాయి.వరుసగా హిందూ దేవాలయాలను టార్గెట్‌గా చేసుకుంటున్నాయి.

తాజాగా మరో ఇస్కాన్ మందిరంపై ఖలిస్తాన్‌కు మద్ధతుగా పిచ్చి రాతలు రాశారు.గడిచిన నెల రోజుల వ్యవధిలో అక్కడి హిందూ ఆలయాలపై ఇటువంటి ఘటన జరగడం ఇది మూడోసారి.

మెల్‌బోర్న్ నగరంలోని అల్బెర్ట్ పార్క్‌లోని ఇస్కాన్ ఆలయంలో ఈ ఘటన జరిగింది.ఈ ఘటనపై మెల్‌బోర్న్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఆస్ట్రేలియా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Telugu India Graffiti, Australia, Canada, India, Iskcon Temple, Khalistan, Melbo

ఇప్పటికే కర్రమ్ డౌన్స్‌లో శ్రీ శివ విష్ణు మందిరం, మిల్ పార్క్‌లోని స్వామి నారాయణ్ మందిరంపై ఖలిస్తానీ మద్ధతుదారులు ఇలాగే పిచ్చి రాతలు రాశారు.మరోవైపు.ఖలిస్తాన్ మద్ధతుదారుల ఆగడాలపై భారత్‌లోని ఆస్ట్రేలియా హైకమీషనర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.తమ దేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనమన్న ఆయన.వాక్ స్వాతంత్య్రానికి తాము మద్దతు ఇస్తామన్నారు.ఇదే సమయంలో హింసకు అండగా నిలవబోమని స్పష్టం చేశారు.

Telugu India Graffiti, Australia, Canada, India, Iskcon Temple, Khalistan, Melbo

ఇదిలావుండగా.పంజాబ్‌లో ఉగ్రవాద దాడులకు పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ మద్దతిస్తోందని భారత నిఘా సంస్థల వద్ద ఆధారాలున్నాయి.బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్, ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్, సిక్స్ ఫర్ జస్టిస్ వంటి భారత్ నిషేధించిన టెర్రరిస్టు గ్రూపులకు చెందిన పలువురు వ్యక్తులు పలు దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారని భారత అధికారులు చెబుతున్నారు.

సిక్కు వేర్పాటువాద సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్ఖలిస్తాన్ కోసం ఇప్పటికే కెనడాలో రెఫరెండం నిర్వహించిన సంగతి తెలిసిందే.అయితే ఈసారి కెనడాలో కాకుండా ఆస్ట్రేలియాలో నిర్వహిస్తామని సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రకటించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube