టీడీపీ అధినేత చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ రేపు లేదా అక్టోబర్ 2వ తేదీ తరువాతనే జరగనుందని తెలుస్తోంది.ఇవాళ చంద్రబాబు కేసు ప్రస్తావనకు రాలేదు.
ఇప్పటికే సీజేఐ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభమైంది.రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారణ నేపథ్యంలో ఇవాళ కోర్టు నంబర్ 1 ముందు కేసుల ప్రస్తావనలు లేవు.
అయితే ఇప్పటికే చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై సీజేఐకి ఆయన తరపు లాయర్లు మెన్షన్ మెమో ఇచ్చారని తెలుస్తోంది.ఈ క్రమంలో చంద్రబాబు పిటిషన్ పై సీజేఐ నిర్ణయం తీసుకుని ఏ కోర్టు ముందు, ఎప్పుడు విచారణ జరపాలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.







