సమాజంలో రౌడీగా కాకుండా మీ పిల్లలకు హీరోల ఉండండి.

మీ కుటుంబ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మారండి.నెరప్రవృతిలో మార్పు తెచ్చేందుకు జిల్లాలోని రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న రౌడీ షీటర్స్ యెక్క నెరప్రవృతిలో మార్పు తెచ్చేందుకు బుధవారం రోజున సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో రౌడి షీటర్స్ మెళ ఏర్పాటు చేసి వారు చేసిన చివరి నేరం, ప్రస్తుతం వారి జీవన విధానం గురించి అడిగి తెలుసుకొని వారి ప్రవర్తనలో మార్పు రావడానికి ఒక అవకాశం కల్పిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ యెక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ నేర జీవితం వీడి ప్రస్తుత సమాజంతో మంచి జీవితం గడుపుతూ హుందాగా జీవిస్తూ ఉండాలని, తొందర పాటులో నేరాలు చేసినా సరే తప్పు చేయని మీ కుటుంబం కూడా దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుందని తెలిపారు.

రౌడీ షీటర్స్ తన కుటుంబం, పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని వారి ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని, రౌడీ షీటర్ అనే ఓ పదం తమ బిడ్డల భవిష్యత్ కూడా నాశనం చేస్తుందని గుర్తు చేశారు.సమాజంలో ఒక రౌడిగా కాకుండా మీ పిల్లలకు ఓ మంచి తల్లిదండ్రులుగా ఉంటూ హీరోగా మిగిలిపోవలని ఎస్పీ తెలిపారు.

జిల్లాలో ఉన్న రౌడి షీటర్స్ కి ఒక అవకాశం కల్పిస్తున్నని పార్లమెంట్ ఎన్నికల అనంతరం డిసెంబర్ లోగా మీ మీ ప్రవర్తనలో మార్పు వస్తే మీ మీద ఉన్న రౌడి షీట్స్ తొలగించేందుకు అవకాశం ఉంటుందని,దానికి కోసం ప్రతి ఒక రౌడీ షీటర్ కదలికలు,చర్యల పై పోలీస్ నిఘా ఉంటుందని, నేర ప్రవృతి లో మార్పు రాకపోతే చట్టపరంగా చర్యల తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా మంచి సత్ప్రవర్తంతో ఉండాలని, ఏలాంటి ప్రలోభాలకు గురై నేరాలకు పాల్పడకుండా నేరప్రవృత్తిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని, ఒకవేళ మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

గత పది సంవత్సరాల నుండి ఎలాంటి నేరాలకు పాల్పడకుండా మంచి సత్ప్రవర్తన కలిగి ఉండి పూర్తిగా మారితే రౌడీ షీట్ తొలగించేందుకు కూడా అవకాశం ఉందని ఎస్పీ గారు అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, నాగేంద్రాచారి, సి.ఐ లు ,ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?
Advertisement

Latest Rajanna Sircilla News