జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్ తనిఖీలు..!

నల్లగొండ జిల్లా: హాలియా మున్సిపాలిటీ మిర్యాలగూడ రోడ్డులోని ఫేమస్ బేకరీ షాపులో కుళ్ళిపోయిన పండ్లు వాడుతూ జ్యూస్ అమ్ముతున్నారని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి, మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీతో కలసి గురువారం బేకరీలో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బేకరీలో అపరిశుభ్రత,కుళ్లిన పండ్లు పదార్థాలు,గడువుతీరిన పాల ప్యాకెట్లు, నాణ్యతలేని లేబుల్స్ లేకుండా బిస్కెట్ ప్యాకెట్స్, బ్రెడ్ ప్యాకెట్స్ గుర్తించినట్లు ఆమె తెలిపారు.

ప్రజలకు హాని కలిగించే తిరుబండారాలను కల్తీ చేస్తూ నియమాలు పాటించకుండా అమ్మకాలు సాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.బేకరీలోని నిషిద్ధ పదార్థాలన్నీ కూడా మున్సిపాలిటీ సిబ్బంది సాయంతో డంపింగ్ యార్డ్ కు తరలించినట్లు తెలిపారు.

బేకరీలో నిలువచేసిన సాసులు, నూనె,మైదాపిండి తదితర ఇతర పదార్థాల నమూనాలు సేకరించి నాణ్యత పరీక్ష కోసం హైదరాబాదులోని పరీక్ష కేంద్రానికి పంపుతామని తెలిపారు.కల్తీ నిర్ధారణ అయితే సంబంధిత వ్యాపార యజమానిపై కేసు నమోదు చేయడంతో పాటు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.

హోటల్,తినుబండారాలు వ్యాపారులు లైసెన్సు లేకుండా,అపరిశుభ్రత వాతావరణంలో నిలువ చేసిన ఆహార పదార్థాలు అమ్మకాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.సంబంధిత బేకరీ యజమానికి స్థానిక మున్సిపల్ అధికారులు 15 వేల రూపాయలు జరిమానా విధించారు.

Advertisement

బేకరీని మూసివేసి నిషిద్ధ పదార్థాలని తొలగించి అనంతరం వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తామని బేకరీ యజమానితో రాతపూర్వకంగా హామీ తీసుకొన్నారు.నమ్మకంతో బేకరీలో ఆహార పదార్థాలు కొనుగోలు చేసిన ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్న యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు.

ఇండియన్ ఫ్యామిలీపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన అమెరికన్ మహిళ.. వీడియో వైరల్..
Advertisement

Latest Nalgonda News