శర్వానంద్ ని లైన్ లో పెట్టిన ఇంద్రగంటి

టాలీవుడ్ లో ఒక్కో దర్శకుడు ఒక్కో జోనర్ లో కథని బలంగా చెబుతాడు.

ఈ నేపధ్యంలో ఆ దర్శకులు కూడా తమకి ఏ జోనర్ లో కథ చెప్పడంలో బలం ఉందో అదే జోనర్ లో సినిమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్, రాజమౌళి అంటే ఫాంటసీ, ఫిక్షన్, పూరీ జగన్నాథ్ అంటే మాఫియా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్, అనిల్ రావిపూడి ఫన్ అండ్ యాక్షన్, కొరటాల శివ అయితే సోషల్ ఎలిమెంట్స్ అండ్ యాక్షన్, సుకుమార్ అయితే డిఫరెంట్ కంటెంట్ పీరియాడిక్ టచ్, బోయపాటి పవర్ ఫుల్ యాక్షన్ జోనర్ లో సినిమాలు చేస్తూ ఉంటారు.అయితే కొంత మంది దర్శకులు మాత్రం ఒక్క జోనర్ కి మాత్రమే అలా స్టిక్ అయ్యి ఉండిపోకుండా సినిమా సినిమాకి పూర్తిగా జోనర్ మార్చేసి సినిమాలు చేస్తూ ఉంటారు.

Indraganti Next Movie With Sharwanand, Tollywood, V Movie, Sudheer Babu Movie, D

అలాంటి వారిలో ఇంద్రగంటి మోహనకృష్ణ ముందు వరుసలో ఉంటారు.గ్రహణం అనే సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసిన ఇంద్రగంటి తరువాత ఫాంటసీ ఎలిమెంట్స్ తో మాయాబజార్ సినిమా చేశాడు.

తరువాత అవుట్ అండ్ అవుట్ ఫన్ తో అష్టాచెమ్మా సినిమా చేసి హిట్ కొట్టాడు.తరువాత స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో గోల్కొండ హై స్కూల్ సినిమా చేశాడు.

Advertisement

ఇక ఇంద్రగంటి దర్శకత్వంలో చివరిగా వి అనే సినిమా యాక్షన్ జోనర్ లో వచ్చింది.ప్రస్తుతం సుదీర్ బాబు హీరోగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో రొమాంటిక్ లవ్ స్టొరీని నేరేట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమా కోసం తాజాగా హీరోని ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది.యంగ్ స్టార్ శర్వానంద్ తో ఇంద్రగంటి సినిమా ఒకే చేయించుకున్నారు.

రీసెంట్ గా అతనికి కథ చెప్పి ఫైనల్ చేయించుకున్నట్లు తెలుస్తుంది.సుదీర్ బాబు సినిమా కంప్లీట్ అయిన తర్వాత శర్వానంద్ సినిమాని పట్టాలెక్కిస్తారు.

ప్రస్తుతం శర్వానంద్ మహా సముద్రం, ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమాలు చేస్తున్నాడు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు