కెనడా వచ్చేముందే ఇవి తెలుసుకోండి .. భారతీయ విద్యార్ధులకు ఇండో - కెనడా సంస్థ సూచనలు

నకిలీ వీసాలు, ఫేక్ ఆఫర్ లెటర్లతో అడ్మిషన్లు సంపాదించిన 700 మంది భారతీయ విద్యార్ధులను( Indian Students ) దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు కెనడా ( Canada ) ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారం ఇరు దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది.

భారత్, కెనడాలకు చెందిన రాజకీయ పార్టీలు విద్యార్థుల పక్షాన నిలబడ్డాయి.ఈ ప్రయత్నాలు ఫలించి విద్యార్ధుల బహిష్కరణ ప్రక్రియను కెనడా ప్రభుత్వం నిలిపివేసింది.

అంతేకాదు.భారతీయ విద్యార్ధులకు తాత్కాలిక అనుమతులను కూడా జారీ చేస్తామని తెలిపింది.

వీసా మోసంపై విచారణను ప్రారంభించి, దేశంలోనే వుండేందుకు అవకాశం కూడా కల్పిస్తోంది.అయితే వీసా( Canada Visa ) సమయంలో భారతీయ విద్యార్ధులు తప్పులు చేస్తుండటంతో చిక్కుల్లో పడుతున్నారు.

Advertisement
Indo-Canada Chamber Of Commerce Key Suggestions To Indian Students On Canadian L

ఈ నేపథ్యంలో ఇండో కెనడియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీసీ)( Indo-Canada Chamber of Commerce ) విద్యార్ధులకు అవగాహన కల్పించే బాధ్యతను తీసుకుంది.ఈ సంస్థ అధ్యక్షుడు మురారీలాల్ థాప్లియాల్( Murarilal Thapliyal ) మాట్లాడుతూ.

కెనడియన్ చట్టాల గురించి భారతీయ విద్యార్ధుల్లో వున్న అజ్ఞానం కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పలువురు విద్యార్ధులు రోడ్డు ప్రమాదాలు, చెరువుల్లో మునిగి చనిపోతుంటే.

ఇంకొందరు స్థానిక చట్టాలపై అవగాహన లేక ఎవరిని అడగాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మురారీలాల్ అన్నారు.భారత్‌లోని ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లే విద్యార్ధుల తరపున చాలా వ్రాతపని చేస్తున్నందున విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు కెనడియన్ చట్టాలు, నిబంధనల గురించి చాలా తక్కువ తెలుసునని ఆయన తెలిపారు.

Indo-canada Chamber Of Commerce Key Suggestions To Indian Students On Canadian L

ఈ క్రమంలోనే విద్యార్ధుల అడ్మిషన్ ఫారమ్‌లకు రసీదు ఫాంను జోడించాలని కెనడా ఇమ్మిగ్రేషన్ శాఖను మురారీలాల్ కోరారు.కెనడాకు వచ్చే భారతీయ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ప్రాథమికంగా కెనడియన్ చట్టాలను చదివామని, వీటిని ఉల్లంఘిస్తే జరిగే పర్యవసానాలు తమకు తెలుసునని సదరు రశీదు పత్రంపై సంతకం చేయాలని ఆయన చెప్పారు.ఇది కెనడియన్ కాలేజీల్లో ప్రవేశానికి ముందస్తు షరతుగా వుండాలని మురారీలాల్ పేర్కొన్నారు.

Indo-canada Chamber Of Commerce Key Suggestions To Indian Students On Canadian L
ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

అలాగే విద్యార్ధులకు పోస్ట్ లాండింగ్ సేవలను అందించేందుకు దేశంలోని అన్ని కాలేజీలు, కెనడా వ్యాప్తంగా వున్న ఎయిర్‌పోర్టుల్లో కౌంటర్లను తెరవాలని ఆయన కోరారు.ప్రతి విద్యార్ధి కెనడియన్ చట్టాలకు సంబంధించిన బుక్‌లెట్‌ను పొందాలని.బహిరంగ ప్రదేశాల్లో చేయవలసినవి, చేయకూడనివి, ట్రాఫిక్ నిబంధనలు, అద్దె చెల్లించకపోవడం వల్ల కలిగే పరిణామాలు, ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లు, ఎన్‌జీవోలు, కాన్సులేట్‌ల సమాచారం గురించి ఖచ్చితంగా తెలుసుకుని వుండాలని మురారీలాల్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు