వేల సంఖ్యలో భారతీయులకి అమెరికా పౌరసత్వం..!

అమెరికాలో గడిచిన ఎడాది ఎన్నారైలకి ఇచ్చిన అమెరికా పౌరసత్వం లెక్కల్ని హోంలాండ్ సెక్యూరిటీ బహిర్గతం చేసింది.2017 సంవత్సరంలో సుమారు 50,802 మంది భారతీయులుకు తమ పౌరసత్వాన్ని పొందారని హోంలాండ్ సెక్యూరిటీ అధికారికంగా ధృవీకరించింది.

అయితే ఈ సంఖ్యని 2016 సంవత్సరంతో పోల్చితే నాలుగువేల మంది ఎక్కువగా పౌరసత్వాన్ని పొందారని తెలిపింది.

ఇక వలసలపై హోంలాండ్ సెక్యూరిటీ విభాగం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం చూస్తే 2016 సంవత్సరం లో 46,188 మంది.2015 సంవత్సరం లో సుమారు 42,213 మంది భారతీయులు అమెరికా పౌరసత్వాన్ని పొందారు.అయితే 2017లో 7,07,265 మంది విదేశీయులు అమెరికా పౌరసత్వాన్ని పొందగా.

అందులో 50,802 మంది భారతీయులు ఉన్నారు.

2016 సంవత్సరం లో 7,53,060 మంది, 2015 సంవత్సరం లో 7,30,259 మంది విదేశీయులు అమెరికా పౌరసత్వాన్ని పొందారు.2017సంవత్సరం లో ఎక్కువగా 1,18,559 మంది మెక్సికన్ పౌరులకు అమెరికా పౌరసత్వం లభించింది.అయితే ఈ లెక్కల్ని అధికారికంగా ద్రువీకరించామని అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ తెలిపింది.

Advertisement
భోపాల్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ .. భారీగా ఎన్ఆర్ఐల రిజిస్ట్రేషన్లు
Advertisement

తాజా వార్తలు