India Bangladesh : ఈ రోజు భారత్ కు బంగ్లాదేశ్ తో కీలక మ్యాచ్.. ముగ్గురు స్టార్ ప్లేయర్లు దూరం..

ప్రస్తుతం టి20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియాలో మొదలై క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్లు హోరాహోరీగా జరుగుతున్నాయి.టి20 వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన విజయం సాధించలేకపోయింది.

టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరడానికి భారత్ కు మరో 3 మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఇక రెండోస్థానం కోసం భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి జట్లు పోటీపడే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే ఈ రోజూ భారత్, బంగ్లాదేశ్ మధ్యన మ్యాచ్ విజేతలు సెమీస్ రేసులోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఈ మ్యాచ్ టీమిండియా కచ్చితంగా గెలవాల్సిందే అని పట్టుదలగా ఉంది.దీంతో ఈ కీలక పోరు కోసం భారత్ జట్టు పటిష్టంగా సన్నాహాలు చేస్తూ ఉంది.ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ లో బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడనుంది.

ఇందులో విజయం సాధిస్తేనే సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి.ఇక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా కూడా భారత్ కు మాత్రం నష్టం తప్పదు.

Advertisement

ఇక ఈ మ్యాచ్ లో భారత్ ప్రధానంగా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో గాయపడిన కీపర్ దినేష్ కార్తీక్ స్థానంలో పంత్ రావడం దాదాపు ఖాయం అయిపోయింది.ఇంకా చెప్పాలంటే అడిలైడ్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అదనపు పేసర్ తో భారత్ బరిలోకి దిగాలని ఆలోచిస్తే మాత్రం.

అశ్విన్ స్థానంలో పేసర్ హర్షల్ పటేల్ ను తుదిజట్టులోకి తీసుకొని వచ్చే అవకాశం ఉంది.ఇక దక్షిణాఫ్రికాతో ఆడిన దీపక్ హుడా మరోసారి బెంచ్ కే పరిమితం కానున్నాడు.

భారత జట్టు అంచనా.రోహిత్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్,మహ్మద్ షమీ, భువనేశ్వర్, అర్ష్ దీప్ సింగ్.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు