కరీంనగర్ జిల్లాలో పెట్రోల్ దొంగలు హల్ చల్ చేస్తున్నారు.జమ్మికుంటలో పార్క్ చేసిన వాహనాల నుంచి పెట్రోల్ ను చోరీ చేస్తున్నారు కొందరు దుండగులు.
రాత్రి సమయాల్లో ఇళ్ల ముందు పార్క్ చేసి ఉంచిన వాహనాల నుంచి పెట్రోల్ ను అపహరిస్తున్నారు.ఈ క్రమంలో ఆంధ్రాబ్యాంక్ వద్ద వ్యాపారుల వాహనాల నుంచి పెట్రోల్ చోరీకి పాల్పడుతున్న కొందరు యువకులు సీసీ కెమెరాలకు చిక్కారు.
దీంతో బాధితులు దుండగులను పట్టుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.







