ఇంకా నాలుగు నెలల లో ఈ దేశాన్ని రెండవ స్థానానికి నెట్టి.. మొదటి స్థానాన్ని దక్కించుకొనున్న భారత్..

ప్రస్తుతం ప్రపంచంలో జనాభా భారీ స్థాయిలో పెరిగిపోతోంది.ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం ఏది అంటే చైనా.

కానీ ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా అవతరించే అవకాశం త్వరలోనే వస్తుంది.అది ఎలాగంటే మరో నాలుగు నెలల్లో జనాభాలో భారత్ చైనా ను వెనక్కి నెట్టి ప్రపంచ నెంబర్ వన్ దేశంగా అవతరించి అవకాశం ఉంది.ప్రస్తుతం చైనా జనాభా 141.5 కోట్లు భూమిపై ఉన్న మొత్తం జనాభాలో మూడో వంతు జనాభా చైనాలోనే ఉంది.2023 ఏప్రిల్ నాటికి భారత్ జనాభా చైనా ను అధిగమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత భారతదేశ జనాభా 139 కోట్లుగా ఉంది.

తాజాగా చైనాలో జననాల సంఖ్య భారీగా పడిపోయింది.గత సంవత్సరంలో కేవలం 1.6 కోట్లు మాత్రమే నమోదు అయ్యాయి.ఆ దేశామృతుల సంఖ్యతో పోల్చితే ఈ సంఖ్య పెద్దది ఏమీ కాదు.భారత్ లోనే అదే పరిస్థితి ఏర్పడింది.1950లో భారత్ సంతాన ఉత్పత్తి రేటు 5.7% ఉండగా అది ఇప్పుడు రెండుకు తగ్గింది.1983లో చైనా జనాభా వృద్ధి రేటు రెండు శాతంగా ఉండేది.ప్రస్తుతం 1.1 శాతంగా ఉంది.అంటే జననాల రేటు దాదాపు సగానికి పడిపోయింది.

కొరియా, మలేషియా, తైవాన్, థాయిలాండ్ వంటి తూర్పు ఆసియా దేశాలు భారత్ కంటే ఆలస్యంగా జనాభా నియంత్రణ చేపట్టినప్పటికీ భారత్ కంటే ముందుగా సంతాన ఉత్పత్తి స్థాయి తగ్గించడంతోపాటు శిశువు మరణాల రేటు తగ్గుదల, ఆదాయాల పెంపు మెరుగైన జీవన విధానాన్ని సాధించాయి.అంతేకాకుండా కొన్ని దశాబ్దాలుగా జనాభాలో జనాభా వృద్ధిరేటు తగ్గుతుంది.

Advertisement
In Four Months, This Country Has Pushed This Country To The Second Position.. In

తాజాగా మరణాల రేటు తగ్గిపోవడం, ఆయుషు పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరిగిపోయింది.

In Four Months, This Country Has Pushed This Country To The Second Position.. In

అంతేకాకుండా ప్రపంచంలో 25 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు భారతీయులే కావడం కూడా విశేషం.మన దేశం మొత్తం జనాభాలో 47% జనాభా 25 ఏళ్లలోపు వారే భారతదేశపు ప్రజల సగటు వయసు 21 సంవత్సరాలుగా ఉండేది.ఆ సమయంలో 60 ఏళ్ళు పైబడిన వారు కేవలం ఐదు శాతం మాత్రమే ఉండేవారు.కానీ ఇప్పుడు భారతదేశ ప్రజల సగటు వయసు 28 సంవత్సరాలకు పెరిగింది.60 ఏళ్లు దాటిన వారు వారి సంఖ్య 10 శాతంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు