ఆ సినిమా సమయంలో ఎన్టీఆర్ కండిషన్ ను బ్రేక్ చేసిన కైకాల సత్యనారాయణ.. అదేమిటంటే?

టాలీవుడ్ ప్రేక్షకులకు నటుడు సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపుగా మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగాడు.

 Rip Kaikala Satyanarayana Whe Kaikala Satyanarayana Breaks Sr Ntr Condition For-TeluguStop.com

అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఏదైనా సినిమా తీస్తే అందులో నటించే నటీనటుల విషయంలో కూడా ఆయన కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ పెట్టేవారు.తనటీ నటులు సైతం ఆ రూల్స్ ని తూచా తప్పకుండా పాటించేవారు.

కానీ ఎన్టీఆర్ పెట్టిన ఒక రూల్ ని మాత్రం కైకాల సత్యనారాయణ ఒక సినిమా విషయంలో బ్రేక్ చేశారట.తెలుగులో ఎన్టీఆర్ దర్శకుడిగా నిర్మాతగా త్రిపాత్రాభినయం చేస్తూ రూపొందించిన సినిమా దాన వీర శూరకర్ణ.

ఈ సినిమా సమయంలో సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు ప్రధాన పాత్రల్లో కురుక్షేత్రం అనే ఒక పెద్ద సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే.ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలో ఒకేసారి తెరకెక్కడంతో నటీనటుల విషయంలో కాల్షిట్ల సమస్య వచ్చి పడింది.

అయితే దానినే ముందుగానే అంచనా వేసిన సీనియర్ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమాలో నటించే నటీనటులు ఎవరూ కూడా కురుక్షేత్రం సినిమాలో నటించకూడదు అని షరతును విధించారట.ఆ సినిమా పూర్తయ్యే వరకు ఎవరు కూడా మాంసాహారం తినకూడదని ఆదేశించారట సీనియర్ ఎన్టీఆర్.

ఇక అందులో అర్జునుడి పాత్ర కోసం మొదట మదాల రంగారావుని ఎంచుకున్నారు ఎన్టీఆర్.కానీ అతను మాంసాహారాన్ని వదిలేయడానికి అంగీకరించలేదు.

Telugu Danaveera, Senior Ntr, Sr Ntr, Tollywood-Movie

దాంతో ఆయన స్థానంలో నందమూరి హరికృష్ణ ను అర్జునుడినా నటించమని చెప్పాడు.అయితే అప్పటికే కైకాల సత్యనారాయణ కురుక్షేత్రం సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు.మరి దానవీరశూరకర్ణ సినిమాలు నటించాలా వద్దా అనే ఆలోచించారు.ఆ సమయంలో కైకాల సత్యనారాయణ వంటి నటుడిని వదులుకోవడం ఇష్టం లేని ఎన్టీఆర్ కైకాల సత్యనారాయణకు మాత్రమే రెండు సినిమాల్లోనూ నటించేందుకు వెసులుబాటును కల్పించారు ఎన్టీఆర్.

ఇది ఇలా ఉంటే తాజాగా కైకాల సత్యనారాయణ ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.గతకొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు మరణించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube