గోవా బ్యూటి మళ్లీ జీరో సైజు లోకి వచ్చేసిందిగా....

తెలుగు సినీ పరిశ్రమకు ఒకప్పుడు జీరో సైజ్ నడుము అంటే ఏంటో పరిచయం చేసి కుర్రకారు మతి పోగొట్టేసినటువంటి గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈ అమ్మడు సినీ పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజ రవితేజ, తదితర స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుని బాగానే మెప్పించింది.

అయితే తెలుగులో అప్పట్లో  చేతి నిండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో బాలీవుడ్ సినీ పరిశ్రమపై మనసు పారేసుకుంది.దీంతో అనుకున్నదే తడవుగా మూటా ముల్లె సర్దుకుని ముంబైకి చెక్కేసింది.

Ileana, Telugu Veteran Actress, Zero Size Fitness, Ileana D'Cruz, Telugu Heroi

ఆ సమయంలో రెండు, మూడు బాలీవుడ్ సినీ అవకాశాలు తలుపు తట్టినప్పటికే ఆ చిత్రాలు పెద్దగా కలిసి రాలేదు.దీంతో కొంత కాలం పాటు ఇలియానా సినీ అవకాశాలు లేక కాలం గడిపింది.

ఈ క్రమంలో బాగానే బరువు పెరిగింది.దీంతో సినిమా అవకాశాలు మాట అటుంచితే జీరో సైజ్ నుంచి బొద్దుగుమ్మ లాగా తయారయినటువంటి ఇలియానాను చూసి దర్శక నిర్మాతలు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.

Advertisement

అంతే కాక అవకాశాలు ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు.దీంతో ఈ అమ్మడు ఎలాగైనా మళ్లీ జీరో సైజు నడుముని సంపాదించి అవకాశాలు దక్కించుకోవాలని కరోనా వైరస్ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా ఇంట్లోనే జిమ్ మరియు వర్కౌట్స్ చేస్తూ ఈ మధ్య బాగానే బరువు తగ్గింది.

అంతేగాక ఈ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా మరియు ఇతర  సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తోంది.దీంతో నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ జీరో సైజ్ నడుము బ్యూటీ ఇలియానా బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్న బిగ్ బుల్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.మరి జీరో సైజ్ నడుము కోసం ఇంతగా ఇలియానా కి సినీ అవకాశాలు దక్కుతాయో లేదో చూడాలి.

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు