గురువారం సాయిబాబాను ఇలా పూజిస్తే మీ కష్టాలన్నీ దూరం..?

గురువారం రోజు బాబాను పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని ప్రజలు నమ్ముతూ ఉంటారు.

గురువారం రోజున సాయిబాబాను నిష్కళంకమైన భక్తితో పూజించి ఉపవాసం ఉన్నవారి కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రజల విశ్వాసం.

సాయిబాబా( Sai Baba ) మహిమ వల్ల సంతానం లేని దంపతులకు కూడా సంతానం కలుగుతుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.సాయిబాబా వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు.

అయితే ఈ వ్రత నియమాలను పాటించడం తప్పనిసరి.

గురువారం సాయిబాబాను ఆరాధించే నియమాలు, ఆచారాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.గురువారం ఉపవాసం ఉండడం మంచిది.ఉపవాసం రోజు ప్రశాంతంగా ఉండండి.

Advertisement

ఎవరి గురించి చెడుగా భావించకూడదు.ఇంకా చెప్పాలంటే మరొకరి గురించి చెడుగా మాట్లాడకూడదు.

సాయిబాబా పూజ ఉపవాసం ఉన్నప్పుడు నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండాలని నియమం లేదు.మీరు ఒక సమయంలో పండు లేదా ఒక భోజనం తినడం ద్వారా ఈ ఉపవాసాన్ని పాటించవచ్చు.

బాబాకు సమర్పించే ప్రసాదాన్ని పంచిపెట్టి తీసుకోవాలి.పూజకు దూపం, దీపం, సాయిబాబా విగ్రహం, చందనం, పసుపు, పువ్వులు, నెయ్యి దీపం, పసుపు వస్త్రం, పంచామృతం, ప్రసాదం, పండ్లు మొదలైనవి అవసరం.హారతి ( Harati )ఇవ్వడం అసలు మర్చిపోకూడదు.

గురువారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి ధ్యానం చేయాలి.అప్పుడు శుభ్రమైన దుస్తులను ధరించాలి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి30, గురువారం 2025

ఆ తర్వాత బాబా విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేయడం మంచిది.దీని తర్వాత సాయిబాబాను ఆరాధిస్తూ ఉపవాసం పాటించాలి.

Advertisement

పూజ ప్రారంభించే పనులు సాయిబాబా విగ్రహం కింద శుభ్రమైన పసుపు వస్త్రాన్ని పరిచి ఉంచండి.అలాగే సాయి చాలీసా( Sai Baba Chalisa ) చదవడం కూడా ఎంతో మంచిది.

సాయి బాబా పూజ ముగింపులో బాబాకు హారతి ఇవ్వడం మర్చిపోకూడదు.అందరికీ ప్రసాదం పంచాలి.

పదిమందికి వీలైనంతలో దానం చేయాలి.అప్పుడు బాబా అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది.

తాజా వార్తలు