Hair Fall Treatment : ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే వింటర్లో హెయిర్ ఫాల్ కు ఈజీగా చెక్ పెట్టవచ్చు!

ప్రస్తుతం వింటర్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్లో సహజంగానే హెయిర్ ఫాల్ సమస్య అనేది అధికం అవుతుంది.

దాంతో జుట్టు రాలడాన్ని ఆపేందుకు నానా తంటాలు పడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే అస్స‌లు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే కనుక చాలా ఈజీగా హెయిర్ ఫాల్ కు చెక్‌ పెట్టవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టు రాలడాన్ని అరికట్టే ఆ సింపుల్ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే అంగుళం అల్లం ముక్కను తీసుకుని పొట్టు తొల‌గించి స్లైసెస్ గా కట్ చేయాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం స్లైసెస్, గుప్పెడు కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement
If You Follow This Simple Tip, You Can Easily Stop Hair Fall In Winter! Stop Hai

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

If You Follow This Simple Tip, You Can Easily Stop Hair Fall In Winter Stop Hai

గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా తలస్నానం చేయాలి.వారంలో రెండు సార్లు కనుక ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే కుదుళ్ళు బలోపేతమై హెయిర్ ఫాల్ క్రమంగా కంట్రోల్ అవుతుంది.అలాగే ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా సైతం పెరుగుతుంది.

కాబట్టి ఎవరైతే హెయిర్ ఫాల్ తో తీవ్రంగా సతమతం అవుతున్నారో వారు తప్పకుండా ఈ చిట్కాను పాటించేందుకు ప్రయత్నించండి.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు