కుసుమ పంటలో ఈ మెళుకువలు పాటిస్తేనే అధిక దిగుబడులు..!

తెలుగు రాష్ట్రాలలో ఉండే నేలలు కుసుమ పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇటీవలే కాలంలో కుసుమ నూనెకు, కుసుమ పూతకు( safflower oil ) మార్కెట్లో గిరాకీ పెరుగుతూ ఉండడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది.

అయితే కొన్ని మెళుకువలు పాటిస్తే పంటలో అధిక దిగుబడి సాధించి మంచి లాభాలను అర్థించవచ్చు.కుసుమ పంట సాగుకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మంచి సమయం.

కుసుమలో రకాన్ని బట్టి పంట కాలం 120 నుంచి 140 రోజుల వరకు ఉంటుంది.గతంతో పోలిస్తే అభివృద్ధి చెందిన రకాలను సాగు చేసి దాదాపుగా 10 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించవచ్చు.

కుసుమ పంటను వేయడానికి ముందు నేలను పరీక్షించాలి.తేమతో కూడిన నల్లరేగడి నేలలు, ఎర్ర గరప నేలలు ( Black clay soils, red clay soils )చాలా అనుకూలంగా ఉంటాయి.ఆమ్లత్వం ఉండే నేలలు కుసుమ సాగుకు పనికిరావు.

Advertisement

ఆమ్లత్వం ఉండే నేలలలో కుసుమ సాగు చేస్తే మ్యాజేరియం ఎండుతెగులు వచ్చే అవకాశం ఉంది.కొద్దిపాటి క్షారత్వాన్ని అయితే కుసుమ పంట తట్టుకోగలుగుతుంది.

వేసవికాలంలో లోతు దుక్కులు బాగా దున్నితే పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంది.ఇక నేలలోని తేమ శాతాన్ని బట్టి పంటకు నీటి తడులను అందించాలి.బరువైన నేలలలో కుసుమ పంట సాగు చేస్తే నీటి అవసరం చాలా తక్కువ.

కేవలం రెండు లేదా మూడు నీటి తడులు అందిస్తే సరిపోతుంది.పంటవేసిన 75 రోజులలోపు కుసుమ పంట పూతకు వస్తుంది.

పూత దశలో పంటకు నీటి తడి అందిస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉంది.పంట వేసినా 35 రోజుల లోపు ఒకసారి కలుపును తీసేయాలి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
వీడియో వైరల్ : పనిమనిషి రోటీలు దొంగిలించి ఎక్కడ దాచిందంటే?

కలుపు సమస్య లేకుండా ఉండాలంటే విత్తిన వెంటనే పెండిమిథాలిన్ 30శాతం ఎకరాకు లీటరు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేస్తే కలుపు సమస్య పెద్దగా ఉండదు.

Advertisement

తాజా వార్తలు