ఏపీ సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మండిపడ్డారు.జగన్ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు.
ఏపీలో మద్యంతో వస్తున్న ఇబ్బందులపై కేంద్ర ఆరోగ్యశాఖకు లేఖ రాసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో మద్యం పేరుతో జరుగుతున్న దోపిడీపై సీబీఐతో విచారణ జరిపించాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.
అనంతరం చంద్రబాబు అరెస్టుకు కేంద్రానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు.చంద్రబాబు కేసును సీఐడీ విచారిస్తోందన్న ఆమె సీఐడీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థని చెప్పారు.
అదేవిధంగా బీజేపీతో పొత్తులో ఉన్నామని పవన్ చెప్పారన్నారు.టీడీపీ బీజేపీతో కలిసి వెళ్తే బాగుంటుందని పవన్ అన్నారని పురంధేశ్వరి తెలిపారు.