ప్రాణంపోయినా సెక్యులర్ పార్టీలోకి వెళ్లను..: ఎమ్మెల్యే రాజాసింగ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను ప్రాణంపోయినా సెక్యులర్ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు.

అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోకి వెళ్లబోనని తెలిపారు.బీజేపీ తనకు టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు పక్కన పెట్టి తాను హిందు రాష్ట్రం కోసం పని చేసుకుంటానని వెల్లడించారు.

తెలంగాణను హిందు రాష్ట్రం చేయడమే తన లక్ష్యమని వివరించారు.అదేవిధంగా గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉందన్న ఆయన అందుకే ఆ విషయాన్ని పెండింగ్ లో పెట్టారని తెలిపారు.

దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.బీజేపీ అధిష్టానం తనపై సానుకూలంగా ఉందని వెల్లడించారు.

Advertisement

సరైన సమయంలోనే తనపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

విశ్వక్ సేన్ కు జోడీగా డ్రాగన్ బ్యూటీ.. టాలీవుడ్ లో ఈమె బిజీ కావడం ఖాయమా?
Advertisement

తాజా వార్తలు