రోడ్డు మీద భారీ కొండచిలువ.. వీడియో చూస్తే షాక్..

మనకు సాధారణంగా చిన్న పాము కనిపిస్తేనే భయపడిపోతాం.అటువంటిది కొండచిలువ కనిపిస్తే ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించుకోండి.

 Huge Python On The Road Shock If You Watch The Video Details, Python, Viral Vide-TeluguStop.com

ఈ కొండ చిలువను చూసిన జనాలు వామ్మో ఇదేంది అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఆ కొండ చిలువ ఎక్కడో నడి అడవిలో కనిపిస్తే అందరూ లైట్ తీసుకునే వారేమో.

కానీ ఆ కొండ చిలువ కనిపించింది నడి రోడ్డు మీద. అదీ కొచ్చి ఎయిర్పోర్టుకు పోయే రోడ్డు.ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ రోడ్డు మీద ఇలా సడెన్ గా కొండ చిలువ కనిపించే సరికి వాహనదారులంతా షాక్ అయ్యారు.కొండ చిలువ రోడ్డు దాటేంత వరకు తమ వాహనాలను అక్కడే ఆపుకున్నారు.

ఆ సమయంలో కొంత మంది వ్యక్తులు ఆ కొండ చిలువ రోడ్డు దాటేటపుడు వీడియోలు తీశారు.సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.

కేరళ రాజధాని కొచ్చిలో సీ పోర్టు నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో ఓ భారీ కొండచిలువ రోడ్డు దాటుతూ కనిపించింది.అదేంటి కొండ చిలువ రోడ్డు మీదకి రావడం ఏంటి అని అనుకుంటున్నారా? ఇది నిజ్జంగా నిజం.దాదాపు 6 అడుగుల పొడవున్న ఆ కొండ చిలువను చూసి వాహన దారులు షాక్ కు గురయ్యారు.ఎక్కడి వారు అక్కడే తమ వాహనాలను ఆపేశారు.

అందరూ సైలెంట్ గా ఉండడంతో ఆ కొండ చిలువ ఎంచక్కా రోడ్డు దాటేసి వెళ్లి పోయింది.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఘటనను చూసిన నెటిజన్లు షాక్ కు లోనవుతున్నారు.వామ్మో అనుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ కొండ చిలువ ఎలా రోడ్డు దాటిందో మీరూ వీడియో చూసేయండి.ఏమనిపించిందో కామెంట్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube