గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్‌ను రోజూ ఇలా వాడితే..మ‌చ్చ‌ల్లేని మెరిసే చ‌ర్మం మీసొంతం!

హెల్త్‌ను కాపాడి, బాడీని ఫిట్‌గా ఉంచ‌డంలో గ్రీన్ టీ అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

అందుకే ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది త‌మ డైట్‌లో గ్రీన్ టీ ఉండేలా చూసుకుంటున్నారు.

అయితే ఆరోగ్యానికి కాదు.సౌంద‌ర్య‌ ప‌రంగానూ గ్రీన్ టీ ఉప‌యోగ‌ప‌డుతుంది.

అయితే గ్రీన్ టీ డైరెక్ట్‌గా కంటే ఐస్ క్యూబ్స్ రూపంలో రెగ్యుల‌ర్‌గా వాడితే బోలెడ‌న్ని స్కిన్ కేర్ బెనిఫిట్స్‌ను మీసొంతం చేసుకోవచ్చు.ఇంకెందుకు ఆల‌స్యం గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ తో వ‌చ్చే ప్ర‌యోజ‌నాలు ఏంటో చూసేయండి.

ముందుగా చ‌ల్లారిన‌ గ్రీన్ టీను ఐస్ ట్రేలో పోసి రిఫ్రిజిరేటర్ లో ఉంచండి.ఐస్ క్యూబ్స్‌గా మారిన త‌ర్వాత వాటిని తీసుకుని ముఖంపై, మెడ‌పై సున్నితంగా ర‌బ్‌ చేయండి.

Advertisement
How To Use Green Tea Ice Cubes For Face! Green Tea Ice Cubes For Face, Green Tea

కాసేపు ర‌బ్ చేసి ఆ త‌ర్వాత స్కిన్‌ను డ్రై అవ్వ‌నిచ్చి అప్పుడు గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.అనంత‌రం మాయిశ్చ‌రైజ‌ర్ అప్లై చేసుకోండి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం ఫ్రెష్‌గా, గ్లోగా మెరుస్తుంది.మ‌రియు ఓపెన్ స్కిన్ పోర్స్ చిన్నవిగా మారిపోయి చ‌ర్మం య‌వ్వ‌నంగా క‌నిపిస్తుంది.

How To Use Green Tea Ice Cubes For Face Green Tea Ice Cubes For Face, Green Tea

అలాగే మొటిమ‌లు స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు చ‌ల్లార్చిన గ్రీన్ టీలో కొద్దిగా ప‌సుపు వేగా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ప‌సుపు క‌లిపి గ్రీన్ టీను ఐస్ ట్రేలో పోసి రిఫ్రిజిరేటర్ లో పెట్టండి.ఆరేడు గంటల త‌ర్వాత ఐస్ క్యూబ్స్‌ను తీసుకుని మొటిమ‌ల‌పై రుద్దండి.

ఇలా ప్ర‌తి రోజు మొటిమ‌లు, వాటి తాలూకు మ‌చ్చ‌లు పోయి చ‌ర్మం అందంగా మెరుస్తుంది.ఇక ఒక క‌ప్పు చ‌ల్లార్చిన గ్రీన్ టీలో ఒక స్పూన్ కొబ్బ‌రి నూనెను యాడ్ చేసి ఐస్ ట్రేలో పోసి రిఫ్రిజిరేటర్ లో ఉంచండి.

స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!
అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

ఐస్ క్యూట్ అయిన త‌ర్వాత తీసుకుని ముఖంపై మ‌రియు క‌ళ్ల చుట్టూ స్మూత్‌గా స‌ర్కిల‌ర్ మోష‌న్‌లో ర‌ద్దండి.కొన్ని నిమిషాల పాటు ఇలా చేసి.

Advertisement

అపై చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్ర ప‌రుచుకోండి.త‌ద్వారా న‌ల్ల‌టి వ‌ల‌యాలు దూరం అవుతాయి.

ముడ‌తులు త‌గ్గుతాయి.డ్రై స్కిన్ స‌మ‌స్య కూడా ఉండ‌దు.

తాజా వార్తలు