ఇంటి డాబా పై కాలీఫ్లవర్ మొక్కలు పెంచే విధానం..!

ఇంటి వద్ద తాజా కూరగాయలు పండించుకోవడానికి పెరటి లాంటి స్థలం ఉండాల్సిన అవసరం లేదు.

టెర్రస్ పైన కానీ, అపార్ట్మెంట్ వాసులైతే బాల్కనీలలో కానీ తాజా కూరగాయలను పెంచుకోవచ్చు.

ఇంటి డాబాపై కాలీఫ్లవర్ ( Cauliflower )ను ఈ పద్ధతులు పాటించి పెంచుకోవాలి.కాలీఫ్లవర్ ను హైబ్రిడ్ విత్తనాల ద్వారా ఏడాది పొడవునా సాగు చేయవచ్చు.

డాబాలలో లేదా కుండీలలో కాలీఫ్లవర్ ను పెంచవచ్చు.విత్తనాలు నాటిన 55 నుంచి 60 రోజుల మధ్యలో కాలీఫ్లవర్ తయారవుతుంది.

మార్కెట్లో దీర్ఘకాలిక, మధ్య కాలిక, స్వల్పకాలిక అనే మూడు రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.దీర్ఘకాలిక రకాలను సెప్టెంబర్, అక్టోబర్ నెలలో విత్తుకోవాలి.

Advertisement

మధ్యకాలిక రకాలు అయితే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో విత్తుకోవాలి.స్వల్పకాలిక రకాల అయితే జులై, ఆగస్టు నెలలో విత్తుకోవాలి.

ఆరోగ్యకరమైన, తెగులు నిరోధక విత్తనాలను దగ్గరలో ఉండే నర్సరీలు లేదంటే ఉద్యాన శాఖ నుండి కొనుగోలు చేసి విత్తుకోవాలి.ముందుగా కాలీఫ్లవర్ నారు ను పెంచుకోవాలి.నారు వయస్సు 25 నుంచి 30 రోజుల మధ్యలో ఉన్నప్పుడు నాటుకోవాలి.

మొక్కల మధ్య దూరం 45 సెంటీమీటర్లు ఉండేటట్లు నాటుకోవాలి.కాలీఫ్లవర్ పెరుగుదల ఉష్ణోగ్రత మరియు సూర్యరశ్మి( sunshine ) సమయం పై ఆధారపడి ఉంటుంది.

కాలీఫ్లవర్ మొక్కలను పెంచే మట్టి విషయానికి వస్తే.సేంద్రియ పదార్థం సమృద్ధిగా ఉండే మట్టి అవసరం.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
అమెరికా : పాలస్తీనా మద్ధతుదారుల నిరసనలు.. భారత సంతతి నేత కమ్యూనిటీ సెంటర్ ధ్వంసం

మట్టి యొక్క పీహెచ్ విలువ ఆరు నుంచి ఏడు మధ్యలో ఉంటే మొక్క ఆరోగ్యకరంగా బాగా పెరుగుతుంది.కాలీఫ్లవర్ పువ్వు తెల్లగా ఎలాంటి మచ్చలు లేకుండా ఉండాలంటే.

Advertisement

పువ్వు పెరుగుతున్న దశలో సూర్యరశ్మి అందులోకి చేరకుండా జాగ్రత్త పడాలి.పువ్వు చుట్టూ ఉండే ఆకులతో చివరి వరస ఆకులను కప్పుతూ లేదా రబ్బర్ బాండ్ తో కట్టాలి.

నీటి అవసరాన్ని బట్టి 5 లేదా 6 రోజులకు ఒకసారి నీటిని అందించాలి.కాలీఫ్లవర్ ను గది ఉష్ణోగ్రతలో దాదాపుగా ఐదు రోజుల వరకు నిల్వ చేయవచ్చు.

తాజా వార్తలు