న్యూఇయర్ వేడుక‌ల్లో మీరు మెరిసిపోవాలా? అయితే ఇలా చేయండి!

న్యూఇయ‌ర్ వ‌చ్చేస్తోంది.యువ‌త న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.

అయితే ఇలాంటి వేడుక‌ల్లో అంద‌రి కంటే అందంగా మెరిసిపోవాల‌నే కోరిక దాదాపు ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంది.

ఈ నేప‌థ్యంలోనే ముఖ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేసుకునేందుకు ఖ‌రీదైన క్రీములు వాడ‌తారు.

ఏవేవో ప్యాకులు వేసుకుంటారు.బ్యూటీ పార్ల‌ర్‌కి వెళ్లి ర‌క‌ర‌కాల ఫేషియ‌ల్స్ చేయించుకుంటూ వేల‌కు వేలు ఖ‌ర్చు పెడుతుంటారు.

కానీ, ఇప్పుడు చెప్పబోయే విధంగా ఇంట్లో ఫేషియ‌ల్ చేసుకుంటే ఎలాంటి ఖ‌ర్చు లేకుండానే న్యూఇయర్ వేడుక‌ల్లో మెరిసిపోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.

Advertisement

స్టెప్-1: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు స్పూన్ల పాలు, ఒక స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మంతో ముఖాన్ని, మెడ‌ను క్లెన్సింగ్ చేసుకుని.ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.స్టెప్‌-2: ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల‌ ఓట్స్ పౌడ‌ర్‌, రెండు స్పూన్ల బంగాళ‌దుంప జ్యూస్‌, ఒక స్పూన్ రోజ్ వాట‌ర్ వేసుకుని క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు ప‌ట్టించి.స్మూత్‌గా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్క్ర‌బ్ చేసుకుని వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.స్టెప్-3: ఒక బౌల్‌లో బాదం నూనె, కొబ్బ‌రి నూనె స‌మానంగా తీసుకుని మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ నూనెను ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.

క‌నీసం ప‌దిహేను నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.ఆపై ఆవిరి ప‌ట్టుకోవాలి.స్టెప్‌-4: రెండు స్ట్రాబెర్రీ పండ్లు తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు రెండు స్పూన్ల స్ట్రాబెర్రీ పేస్ట్‌లో ఒక స్పూన్ కోకో పౌడర్, ఒక స్పూన్ తేనె వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని ఇర‌వై నిమిషాల అనంత‌రం కూల్ వాట‌ర్‌తో వాష్ చేసుకోవాలి.

న్యూ ఇయ‌ర్‌ వేడుక‌ల‌కు మూడు లేదా నాలుగు రోజుల‌కు ముందు పైన చెప్పిన విధంగా ఫేషియ‌ల్ చేసుకుంటే.ముఖ చ‌ర్మం స‌హ‌జంగానే కాంతి వంతంగా మారుతుంది.మ‌రియు చ‌ర్మంపై ఉన్న మ‌లినాలు, మృత క‌ణాల‌న్నీ పోయి ఫ్రెష్‌గా మారుతుంది.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు