OTT Movies Version : ఓటిటి నుంచి వందల కోట్లు దండుకోవడానికి దర్శక నిర్మాతల సరికొత్త ప్లాన్

కొన్ని సినిమాలు థియేటర్లో భారీగా విజయాలను అందుకుంటున్నాయి.మరి భారీగా విజయాలను  అందుకుంటున్నాయంటే ఏంటి అర్థం.

ఖచ్చితంగా చాలామంది థియేటర్ కి వచ్చి చూశారనే కదా.ఒకసారి థియేటర్లో ప్రేక్షకుల చేత మెప్పించబడిన సినిమాని మళ్లీ ఓటిటిలో( OTT ) అదే ప్రేక్షకుడు ఎందుకు చూస్తాడు.ఒకవేళ చూసినా కొత్తగా చూడడానికి ఏముంటుంది.

కొంతమేర ప్రేక్షకులు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించినా చాలా మట్టుకు చూసిన సినిమాను చూడడానికి ఇష్టపడరు కదా.అందుకే కొత్తగా సినిమాలు చూడడానికి ఏముంటుంది.అలాంటప్పుడు కోట్లకు కోట్లు పెట్టి మేము ఎందుకు సినిమా కొనాలి అనేది నిర్మాతలను( Producers ) ఓటిటి అడుగుతున్న ప్రశ్న.

దీనికి సమాధానం గా ఇప్పుడు దర్శక నిర్మాతలు ఒక కొత్త ప్లాన్ తో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.మరి ఓటిటిని మెప్పించడానికి దర్శకులు( Directors ) వేస్తున్న ప్లాన్ ఏంటి? దానికి సంబంధించిన వివరాలు ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Advertisement

ఓటిటి మార్కెట్ పెంచుకోవడానికి ఇప్పుడు దర్శక నిర్మాతల ముందు ఒకే ఒక ప్లాన్ ఉంది.ఏంటంటే థియేటర్లో చూసిన కంటెంట్ కి సరికొత్తగా కంటెంట్ జత చేసి ఓటిటిలో విడుదల చేయడం.దానివల్ల ప్రేక్షకుడు మళ్లీ కొత్తదనం చూసే అవకాశం ఉండి ఫ్రెష్ గా ఎగ్జైట్ అయి చూస్తాడు.

ఈ మార్గాన్ని ఎంచుకొని కొంతమంది దర్శకులు తమ సినిమాని కొంతమేర ఓటిటి కోసం పక్కన పెట్టుకుంటున్నారు.

మొట్టమొదటగా జవాన్ సినిమా( Jawan Movie ) కోసం అట్లీ( Atlee ) ఈ ప్లాన్ చేశాడు.థియేటర్లో లేని కొన్ని సీన్స్ ఓటిటి వర్షన్ కోసం జత చేసి విడుదల చేయగా అక్కడ కూడా వ్యూవర్స్ బాగా పెరిగారు.అట్లీ దోవలోనే లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ) సైతం లియో సినిమా( Leo Movie ) కోసం ఇలాంటి పథకాన్ని రచించి ఓటిటి ప్రేక్షకుల ను ఫ్రెష్ ఫీల్ అయ్యేలా చేశాడు.

ఇక సందీప్ రెడ్డి వంగ అయితే మరో లెవెల్.ఖచ్చితంగా ఓటిటి కోసమే సరికొత్త వెర్షన్ ని రెడీ చేస్తున్నాడు ఆయన.పైగా అర్జున్ రెడ్డి సినిమా కోసం కూడా ఇదే స్ట్రాటజీ వాడి ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేశాడు.హనుమాన్( Hanuman Movie ) కోసం కూడా ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) ఇదే పద్దతిని వాడుతున్నాడు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఇలా మొత్తానికి థియేటర్లో చూసిన ప్రేక్షకుడు ఓటిటిలో మరోమారు చూసేందుకు వందల కోట్ల ఓటిటి మార్కెట్ ని గ్రాబ్ చేసేందుకు దర్శకులు కొత్త పథకాలను వేస్తూ బాగానే డబ్బు దండుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు