ట్రంప్ కి సొంత పార్టీ నుంచీ షాక్ తగులుతోంది..

ట్రంప్ ఎఫెక్ట్ మెల్ల మెల్లగా సొంత పార్టీనేతల తాకుతోంది.ప్రపంచదేశాలకి విసుగుతెప్పిస్తున్న ట్రంప్ చర్యలు ఆతరువాత అమెరికాని ఆ క్రమంలో వలస విధానాల వలన సొంత భార్య కి ఇప్పుడు తాజాగా ఇదే విధానంపై సొంత పార్టీ నేతలకి విసుగు తెప్పిస్తున్నాయి.

ట్రంప్ ఒక్కడు తప్ప వలస విధానంపై అందరూ వ్యతిరేక గొంతు విన్పిస్తున్న తరుణంలో సైతం ట్రంప్ వలస జీవులపై ఉక్కు పాదం మోపాలని ప్రయత్నాలు చేస్తున్నాడు,,

విదేశీ వలస దారులకి చెక్ పెట్టాలని భావిస్తున్న ట్రంప్ కి ఆయన సొంత రిపబ్లికన్ పార్టీ నుంచే తీవ్ర విమర్శలు వస్తుండడం అమెరికాలో హాట్ టాపిక్ అయ్యింది.అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం అమెరికాలో జన్మించే చిన్నారులు ఎవరికైనా పౌరసత్వ హక్కు లభిస్తుంది.చిన్నారి తల్లిదండ్రులు ఏ దేశం వారైనా సరే అమెరికాలో పిల్లలుగా పుడితే వారు అమెరికన్ సిటిజన్ అయిపోతారు.

దీంతో చాలా మంది వలసదారులు ఇదే ప్లాన్ అప్లయి చేస్తూ అమెరికన్ పౌరసత్వం పొందుతున్నారట.

అయితే ఈ విధానం వలన అసలైన అమెరికన్ల కి ఎంతో అన్యాయం జరుగుతోందని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు.తాజాగా బుధవారం ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.ఇక్కడికి వేరే దేశం నుంచి వచ్చి బిడ్డను కంటే ఆ చిన్నారికి అమెరికా పౌరసత్వం దానంతట అదే వస్తోంది.

Advertisement

అమెరికా పౌరులకుండే సకల ప్రయోజనాలు 85 ఏళ్ల పాటు ఆ చిన్నారి పొందుతోంది.ఈ పద్ధతికి చరమగీతం పాడాలనుకుంటున్నా అని స్పష్టం చేశారు.ఈ నిర్ణయం పట్ల సొంత రిపబ్లికన్ పార్టీ సభ్యుడు, ప్రతినిధుల సభ స్పీకర్ పౌల్ రేయాన్ దీన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

పౌరసత్వ హక్కును ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో తొలగించలేరని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు