గొంతులో క‌ఫానికి చెక్ పెట్టే ఎఫెక్టివ్ టిప్స్ మీకోసం!

అప్పుడ‌ప్పుడు గొంతులో క‌ఫం చేరుతూ ఉంటుంది.

ఈ క‌ఫం వ‌ల్ల గొంతు గ‌ర గ‌ర మ‌న‌డం, తీవ్ర అసౌక‌ర్యం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

ఈ క‌ఫం విష‌యంలో నిర్ల‌క్ష్యంగా ఉంటే ద‌గ్గుకు కూడా దారితీస్తుంది.అందుకే వీలైనంత త్వ‌ర‌గా క‌ఫాన్ని నివారించుకోవాలి.

మరి క‌ఫాన్ని ఎలా త‌గ్గించుకోవాలి.అందు కోసం ఏం ఏం చేయాలి.

అన్న విష‌యాలు లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.గొంతులో క‌ఫానికి చెక్ పెట్ట‌డంలో ఉల్లిపాయ అద్భుతంగా స‌మాయ‌ప‌డుతుంది.

Advertisement

ఒక ఉల్లిపాయను తీసుకుని మెత్త‌గా గ్రౌండ్ చేసి ర‌సం తీసుకోవాలి.ఆ ర‌సంలో కొద్దిగా స్వ‌చ్ఛ‌మైన తేనె మిక్స్ చేసి సేవించాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఉల్లిలో ఉండే సల్ఫర్ ఇట్టే క‌ఫాన్ని నివారిస్తుంది.అలాగే పుదీనాతో కూడా గొంతులో ఏర్ప‌డిన క‌ఫాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

ఒక గ్లాస్ వాట‌ర్‌లో కొన్ని పుదీనా ఆకులు వేసి బాగా మ‌రిగించి.వ‌డ‌బోసుకోవాలి.ఇప్పుడు ఈ నీటిలో కొద్దిగా నిమ్మ ర‌సం క‌లిపి సేవిస్తే క‌ఫం క్ర‌మంగా త‌గ్గిపోతుంది.

అలాగే ఒక గిన్నెలో కొన్ని మెంతులు, నాలుగైదు ల‌వంగాలు వేసి లైట్‌గా వేయించాలి.ఇప్పుడు కాట‌న్ క్లాత్‌లో వీటిని చుట్టి.గొంతు మ‌రియు మెడ‌పై మెల్ల మెల్ల‌గా అద్దుకోవాలి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

ఇలా చేసినా క‌ఫం క‌రిగిపోతుంది.ఇక వీటితో పాటు త‌ర‌చూ ఆవిరి ప‌డుతూ ఉండాలి.

Advertisement

ఆవిరి ప‌ట్ట‌డం ద్వారా క‌ఫం త‌గ్గి.గొంతు క్లీన్ అవుతుంది.

అలాగే క‌ఫం ఏర్ప‌డిన‌ప్పుడు పాలు, ఇత‌ర పాల ఉత్ప‌త్తులు, ఆయిల్ ఫుడ్స్‌, బాగా ఫ్రై చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్‌, ఐస్ క్రీములు వంటి వాటికి దూరంగా ఉండాలి.లేదంటే క‌ఫం మ‌రింత ఎక్కువ అవుతుంది.

వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవాలి.మ‌ద్యం సేవించ‌డం, స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి.

తాజా వార్తలు