వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలని సిబిఐ కోర్టు లో రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో, రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే తీర్పు సారాంశం ఏంటో పూర్తిగా తెలుసుకోకుండానే, ఆ తీర్పుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై విచారణ చేసిన హైకోర్టు తీర్పును ఈరోజుకు రిజర్వ్ చేసింది.
ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు తీరుపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
తీర్పు రాకుండానే దానిపై అనుమానాలు వ్యక్తం చేయడం పై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
రఘురామ అనుమానాలను తప్పుబట్టింది.అసలు సీబీఐ కోర్టు తీర్పు ఆపాలని కోరడం వెనుక ఉద్దేశం ఏమిటి అంటూ రఘురామని ప్రశ్నించింది.
సీబీఐ కోర్టు నే అనుమానిస్తారా అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది.చిన్న చిన్న కారణాలతో న్యాయస్థానాల పై అనుమానం వ్యక్తం చేస్తారంటూ తప్పు పట్టడం చర్చనీయాంశం అయింది.

ఇదిలా ఉంటే జగన్ విజయసాయి రెడ్డి అక్రమాస్తుల కేసులో సిబిఐ గతంలో ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు.దీనికి జగన్, విజయసాయిరెడ్డి తో పాటు సిబిఐ కూడా కౌంటర్ ఇచ్చింది.సిబిఐ ఇచ్చిన మెమోలో తన వాదనలు వినిపించకుండా కోర్టు నే తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది.దీనిపై వేసిన పిటిషన్ పై సుదీర్ఘ విచారణ జరిపిన సీబీఐ కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించబోతోంది.
వాస్తవంగా ఈ తీర్పు గత నెల 23వ తేదీన వెలువడాల్సి ఉండగా, అనేక కారణాలతో ఈరోజుకి వాయిదా పడింది.దీంతో ఈ రోజు ఏ రకమైన తీర్పు వస్తుందనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.