Mrinal Thakur : నేను చనిపోతే కుటుంబం ఏమైపోతుందా అని భయపడతాను.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ ఇమేజ్ ను కలిగి ఉన్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్( Mrinal Thakur ) ఒకరు కావడం గమనార్హం.

ఇప్పటివరకు తెలుగులో ఆమె నటించిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలు సక్సెస్ సాధించడం మృణాల్ ఠాకూర్ కెరీర్ కు ప్లస్ అయ్యాయి.

మరో ఐదు రోజుల్లో మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ ( Family star ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఒకప్పుడు మరాఠీ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న మృణాల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

సీతారామం, హాయ్ నాన్న( Sitaram, Hi nanna ) సినిమాల విజయాల తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు.ఇప్పటివరకు మృణాల్ ఠాకూర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలలో ఎక్కువగా నటించారు.

ఫ్యామిలీ స్టార్ సినిమాలో సైతం అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే ఆమె నటించడం గమనార్హం.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ సెలబ్రిటీ స్టేటస్( Celebrity status ) గురించి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Heroine Mrunal Thakur Comments About Death Details Here Goes Viral In Social Me
Advertisement
Heroine Mrunal Thakur Comments About Death Details Here Goes Viral In Social Me

సెలబ్రిటీగా ఉంటే ఈ ప్రపంచం నిన్ను ప్రేమిస్తుందని నీ వర్క్ తో సమాజంలో మార్పు తీసుకురావచ్చని ఆమె తెలిపారు.సెలబ్రిటీ స్టేటస్ ఉన్నవాళ్లు షూటింగ్స్ వల్ల వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.అవసరమైన సమయంలో సైతం కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండలేమని మృణాల్ ఠాకూర్ పేర్కొన్నారు.

కొన్నిసార్లు తనకు కూడా సాధారణ లైఫ్ గడపాల్సి వస్తుందని ఆమె వెల్లడించారు.

Heroine Mrunal Thakur Comments About Death Details Here Goes Viral In Social Me

పల్లెటూరి అమ్మాయిలలా 20 సంవత్సరాలకే పెళ్లి చేసుకుని పిల్లల్ని కని రెస్టారెంట్ కు వెళ్లి రావాలని ఉంటుందని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు.మృణాల్ ఠాకూర్ ఇతర హీరోయిన్లతో పోల్చి చూస్తే డిఫరెంట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మృణాల్ ఠాకూర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెరుగుతోంది.

చావు గురించి ఆలోచిస్తే నాకు భయమని నేను చనిపోతే ఫ్యామిలీ ఏమైపోతుందా అని ఆలోచిస్తానని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు.

అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు