చరణ్ పాత్రకు సంబంధించి అలాంటి లోపం.. సినిమాకు అదే ప్లస్ కాబోతుందా?

ఇటీవల కాలంలో హీరోని డీ గ్లామర్‌ గా చూపించినా కంటెంట్‌ పవర్‌ ఫుల్‌ గా ఉంటే తప్పకుండా ప్రేక్షకులు సినిమాను చూడడంతో పాటు బాగా ఆదరిస్తున్నారు.

అయితే ఇలాంటి కథ నేపథ్యంలో తిరిగి ఇచ్చిన సినిమాలు గతంలో చాలానే వచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి.ఇటీవల కాలంలో సుకుమార్‌ చేసిన రెండు సినిమాల్లో హీరోని డీ గ్లామరైజ్డ్‌ గా చూపించడం, వారికి ఏదో ఒక శారీరక లోపాన్ని పెట్టడం చేశారు.

Hero Ram Charan Game Changer New Update Details, Game Changer, Ram Charan, Tolly

ఆ రెండు సినిమాలు రంగస్థలం, పుష్ప.రంగస్థలంలో( Rangasthalam ) చరణ్‌ కి చెవుడు ఉన్నట్టు చూపించారు.ఇక పుష్పలో( Pushpa ) అల్లు అర్జున్‌ భుజంలో లోపం ఉన్నట్టు చూపించారు.

ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్‌ బస్టర్స్‌ గా నిలిచాయి.ఇప్పుడు రాబోతున్న రామ్‌ చరణ్‌( Ram Charan ) మూవీ గేమ్‌ ఛేంజర్‌( Game Changer ) సినిమాలో కూడా హీరో క్యారెక్టర్‌ లో ఒక లోపాన్ని చూపించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement
Hero Ram Charan Game Changer New Update Details, Game Changer, Ram Charan, Tolly

కాగా ఈ సినిమాలో చెర్రీ రెండు క్యారెక్టర్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే.అందులో ఒక క్యారెక్టర్‌ కి నత్తి ఉంటుందట.

Hero Ram Charan Game Changer New Update Details, Game Changer, Ram Charan, Tolly

ఫ్లాష్‌ బ్యాక్‌ లో వచ్చే ఎపిసోడ్‌ లో పెద్ద వయసుతో కనిపించే అప్పన్న క్యారెక్టర్‌ కి ఈ లోపాన్ని పెట్టారని తెలుస్తోంది.అతనికి ఉన్న లోపం కథలో ఒక ట్విస్ట్‌ కి కారణమవుతుందట.ఈ ఎపిసోడ్‌ సినిమాని ఒక రేంజ్‌కి తీసుకెళ్తుందని సమాచారం.

శంకర్‌ సినిమాల్లో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్స్‌ ఎంత పవర్‌ ఫుల్‌గా ఉంటాయో అందరికీ తెలుసు.వాటిని మించే రీతిలో ఈ సినిమాలోని ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ ని తీశారని చెబుతున్నారు.

ఈ ఎపిసోడ్‌ క్లిక్‌ అయితే సినిమా ఒక రేంజ్‌కి వెళ్లిపోవడం ఖాయమని చిత్ర యూనిట్‌ చెబుతోంది.మరి ఈ సినిమాల లోపం చరణ్ కి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అన్నది తెలియాలి అంటే ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు