నాని ఏంటీ స్పీడు.. కాస్త జాగ్రత్త, లేదంటే ఇబ్బందులు తప్పవు!

యంగ్‌ హీరో నాని తాజాగా నాగార్జునతో కలిసి నటించిన ‘దేవదాసు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పర్చిన విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది.

దాంతో తనకంటే సీనియర్‌ హీరోలతో, స్టార్‌ హీరోలతో మల్టీస్టారర్‌ చేయవద్దని నాని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.ఇక ప్రస్తుతం నాని జర్సీ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.

క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘జర్సీ’ చిత్రం భారీ అంచనాల నడుమ గౌతమ్‌ దర్శకత్వంలో రూపొందుతుంది.ఈ చిత్రం పూర్తి కాకుండానే అప్పుడే నాని మూడు సినిమాకుల కమిట్‌మెంట్‌ ఇచ్చాడు.

జర్సీ పూర్తి అవ్వకుండానే వచ్చే నెలలో అంటే జనవరిలో విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీస్‌ వారి బ్యానర్‌లో ఒక చిత్రాన్ని చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.ఇటీవలే వీరిద్దరి కాంబోకు కథ సిద్దం అయ్యింది.చాలా స్పీడ్‌గా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను దర్శకుడు విక్రమ్‌ చేస్తున్నాడు.

Advertisement

సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడయ్యే అవకాశం ఉంది.ఇక ఇప్పటికే దర్వకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని రెండు సినిమాలు చేశాడు.

తాజాగా మూడవ సినిమాను చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.ఆ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

ఆ సినిమాలో నానితో పాటు మరో యంగ్‌ హీరో కూడా ఉంటాడట.దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

ఆ మూడు సినిమాలు మాత్రమే కాకుండా తాజాగా అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో ఒక మాస్‌ మూవీని చేసేందుకు ఓకే చెప్పాడు.ప్రస్తుతం ఎఫ్‌ 2 చిత్రంతో బిజీగా ఉన్న దర్శకుడు అనీల్‌ రావిపూడి తాజాగా నానికి ఒక కథ వినిపించాడట.ఆ కథ నానికి బాగా నచ్చడంతో వెంటనే వచ్చే ఏడాది చివర్లో చేద్దామని డేట్లు కూడా ఇచ్చేశాడట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
కొరటాల శివ ఆ స్టార్ హీరో తో సినిమా చేస్తున్నాడా..?

ఇలా వరుసగా నాని సినిమాలకు కమిట్‌ అవుతూ ఉన్నాడు.ఈ స్పీడ్‌ సినిమాల ఎంపికలో కథల విషయంలో ఏమైనా అశ్రద్ద చూపుతున్నాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

కాని నాని మాత్రం అటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోడంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.నానితో త్రివిక్రమ్‌ కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది.అది ఎప్పుడు ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు