సూర్యాపేట జిల్లాలో విద్యుత్ శాఖకు భారీ నష్టం:సిఎండి ముషారఫ్ పరూఖీ

సూర్యాపేట జిల్లా:ఇటీవల కురిసిన భారీ వర్షాల( Heavy rains ) కారణంగా రాష్ట్రంలోనే అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యిందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు.

సూర్యాపేట జిల్లా కోదాడలో వరద ప్రభావంతో దెబ్బతిన్న రామాపురం,ఎంబీగూడెం సబ్ స్టేషన్లను,ఇతర విద్యుత్ నెట్వర్క్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈదురు గాలుల ప్రభావంతో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ స్తంభాలపై పడటంతో 15 33 కేవీ పోల్స్,1074-11 కేవీ పోల్స్,1038 LT పోల్స్ మరియు 319 ట్రాన్స్ ఫార్మర్స్ దెబ్బతిన్నాయన్నారు.దీనికి తోడు నాలుగు సబ్ స్టేషన్స్ వరద ముంపుకు గురయ్యాయని,ఇంతగా భారీ నష్టం జరిగినా, యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం కోసం తమ సిబ్బంది, అధికారులు అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు.

ఈకార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ రూరల్ జోన్ పి.భిక్షపతి, సూపెరింటెండింగ్ ఇంజినీర్ ఫ్రాంక్లిన్, డివిజనల్ ఇంజినీర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

వీధి దీపాలు లేక చీకట్లో ఇక్కట్లు పడుతున్న ప్రజలు
Advertisement

Latest Suryapet News