చలికాలంలో గోరువెచ్చని నీళ్లు తాగడం వలన ఏం జరుగుతుందో తెలుసా..?

శీతాకాలం( Winter Season ) మొదలైంది అంటే చాలు జలుబు, గొంతు నొప్పి, చాతి బిగిసుకుపోవడం, చలి జ్వరం లాంటి ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అయితే ఈ సీజన్ లో గోరువెచ్చని నీళ్లు తాగడం వలన ఏం జరుగుతుంది? దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వయోజన పురుషుల శరీరంలో 65% నీరు ఆడవారి శరీరంలో 52 శాతం నీరు ఉంటుంది.

ఇది మనం బతకడానికి కాకుండా మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.అలాగే మనల్ని అన్ని విధాల ఆరోగ్యంగా ఉండడానికి నీరు చాలా అవసరం.నీరు మన శరీరంలోపలి భాగాన్ని శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది.

నీరు కూడా మన శరీరానికి ఆక్సిజన్ అందించే పని చేస్తుంది.

అయితే చాలా మంది చలికాలంలో నీటిని అస్సలు తాగరు.ఎందుకంటే ఈ సీజన్ లో అంతగా దాహం అనిపించదు.కాబట్టి చాలామంది ఎక్కువగా నీరు తాగకుండా ఉంటారు.

Advertisement

అలాగే ఈ సీజన్లో జలుబు( Cold ), గొంతు నొప్పి లాంటి సమస్యల బారినపడి బాధపడుతూ ఉంటారు.అందుకే ఈ సీజన్లో మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా నీటిని కచ్చితంగా తాగాలి.చలికి చల్ల నీటిని తాగాలని అనిపించదు.

కాబట్టి గోరు వెచ్చని నీటిని తాగండి.గోరు వెచ్చని నీరు మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది.

చలికాలంలో గోరువెచ్చని నీటిని తాగడం వలన మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు నిద్రలేచిన వెంటనే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరు వెచ్చని నీటిని( Warm Water ) కచ్చితంగా తాగాలి.అయితే ఇది మీ పొట్టను శుభ్రపరుస్తుంది.అలాగే మలబద్ధక సమస్యలను కూడా దూరం చేస్తుంది.

Advertisement

ఇక బరువు నియంత్రణ కోసం కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.అంతే కాకుండా గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ కలిపి తాగడం వలన మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.

మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.ఇక ప్రతి ఒక్కరికి కూడా ఉదయాన్నే రోజు టీ తాగే అలవాటు ఉంటుంది.

దానికి బదులుగా గోరువెచ్చని నీటితో రోజును మొదలుపెడితే గ్యాస్, ఎసిడిటీ లాంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

తాజా వార్తలు