నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదు..: మాజీమంత్రి గంగుల

పార్టీ మార్పు వార్తలపై మాజీ మంత్రి గంగుల కమలాకర్( Former minister Gangula Kamalakar ) స్పందించారు.

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు.

కేసులకు భయపడి పార్టీ మారే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదని చెప్పారు.

తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )పార్టీ మారిన వారిని ప్రోత్సహిస్తారని అనుకోనని గంగుల కమలాకర్ అన్నారు.

ఈ క్రమంలోనే తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని వెల్లడించారు.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు