Vemireddy Prabhakar Reddy : ఆయన వస్తున్నారు : ఆ జిల్లాలో టీడీపీ చింత తీరినట్టే 

కొన్ని జిల్లాల్లో టిడిపికి ఎడ్జ్ కనిపిస్తున్నా,  కొన్ని జిల్లాల్లో మాత్రం పూర్తిగా వైసిపి ప్రభావం కనిపిస్తుంది.2019 ఎన్నికల్లో వైసిపి క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి .

అక్కడ వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలలో ముగ్గురు టిడిపి వైపు రావడంతో,  వైసిపి( YCP ) బలం తగ్గించామనే అభిప్రాయంలో టిడిపి ఉంది.ఇక వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాపై పూర్తిగా పట్టు సాధించాలని చూస్తున్న టిడిపి దానికి తగ్గట్లుగానే కసరత్తులు చేస్తోంది.

వైసీపీలోని అసంతృప్త నాయకులను గుర్తించి తమ పార్టీలో చేరాల్సిందిగా రాయబారాలు పంపుతోంది. 

మొన్నటి వరకు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఎవరిని పోటీకి దించాలా అని టిడిపి చాలా ఆందోళన చెందింది .బలమైన నేత ఎవరు లేకపోవడంతో,  మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అక్కడ పోటీ చేయాల్సిందిగా ఆదేశించింది.అయితే ఆయన అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఇష్టపడకపోవడం,  తాను మరోసారి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో,  అక్కడ ఎంపీ అభ్యర్థి కోసం వెతుకులాట మొదలు పెట్టింది.

సరిగ్గా ఇదే సమయంలో వైసీపీలో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తితో నిన్ననే ఆ పార్టీకి రాజీనామా చేశారు నెల్లూరు జిల్లా వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి( Vemireddy Prabhakar Reddy ) దీంతో ఆయనను టిడిపిలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీకి చెందిన కీలక నేతలే రంగంలోకి దిగారు.

Advertisement

నిన్న వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ పదవికి వేమిరెడ్డి దంపతులు రాజీనామా చేశారు .తర్వాత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి( Chandramohan Reddy Somireddy ) తో పాటు , కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆయన కలిశారు.నేడు మరి కొంతమంది టిడిపి కీలక నేతలను కలవనున్నారు.

ముఖ్యంగా మాజీ మంత్రి నారాయణ వేమిరెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు.టిడిపిలోకి రావాలని , వస్తే సముచిత స్థానం ఇవ్వడంతో పాటు , ఎంపీ టిక్కెట్ ఇస్తామని ఆఫర్ ను కూడా నారాయణ ఇచ్చారట.

దీంతో వేమిరెడ్డిని టిడిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారట.  వాస్తవానికి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో టిడిపి తరఫున పోటీ చేసేందుకు బలమైన నేత ఎవరు లేరు.

ఇది వైసీపీకి కంచుకోట కావడంతో,  ఇక్కడ ఎవరిని పోటీకి దింపాలి అనే విషయంలో టీడీపీ చాలా తర్జన భర్జన పడుతోంది.ఇప్పుడు వేమిరెడ్డి పార్టీలో చేరితే , ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే ఆ ప్రభావం జిల్లా అంతటా కనిపిస్తుందని,  ఎంపీ గా వేమిరెడ్డి గెలవడంతో పాటు,  మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించగల సత్తా ఆయనకు ఉందని టిడిపి నమ్ముతోంది.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

అందుకే ఆయనకు అంతగా ప్రాధాన్యం ఇస్తూ , ఆయన షరతులు అన్నిటిని అంగీకరించేందుకు సిద్ధమే అనే సంకేతాలు పంపుతోంది.

Advertisement

తాజా వార్తలు