సునీల్ కమెడియన్ పాత్రలకు గుడ్ బై చెప్పారా... సునీల్ ఇకపై నవ్వించలేరా?

తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సునీల్ గురించి పరిచయం అవసరం లేదు కొన్ని వందల సినిమాలలో తన అద్భుతమైన కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా అందరిని నవ్వించిన కమెడియన్ సునీల్ ఈ మధ్యకాలంలో కామెడీ పాత్రలకు కమిట్ అవ్వడం లేదు.

వందల సినిమాలలో కమెడీయన్ గా అందరిని సందడి చేసిన ఈయన అనంతరం హీరోగా మారిపోయారు.

అయితే హీరోగా పలు సినిమాలలో నటించినప్పటికీ ఈయనకు సక్సెస్ రాకపోవడంతో తిరిగి కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చారు.ఇలా కమెడియన్ గా సినిమాలలో నటిస్తున్న సునీల్ మొదటిసారిగా డిస్కో రాజా సినిమాలో విలన్ పాత్రలో నటించారు.

Has Sunil Said Goodbye To Comedian Roles Sunil Cant Laugh Anymore, Sunil ,comed

ఇలా ఈయన విలన్ పాత్రలలో అద్భుతంగా నటించడంతో తదుపరి కలర్ ఫోటో సినిమాలో కూడా మంచి అవకాశాన్ని అందుకున్నారు.ఇక పాన్ ఇండియా స్థాయిలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో మంగళం శీను పాత్ర ద్వారా ఎంతో మందిని తన విలనిజంతో భయపెట్టిన సునీల్ కు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ వచ్చింది.అయితే పుష్ప సినిమా తర్వాత ఈయనకు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

Has Sunil Said Goodbye To Comedian Roles Sunil Cant Laugh Anymore, Sunil ,comed

ఈ విధంగా ఈయనకు ఇతర భాష సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా కామెడీ పాత్రలు కాకపోవడం గమనార్హం.ఈ విధంగా ఈయనకు అన్నీ భాషలలో కూడా విలన్ పాత్రలు రావడంతో ఇక సునీల్ ప్రేక్షకులను ఎప్పటిలాగా తన కామెడీతో నవ్వించలేరని ఈయన కామెడీ పాత్రలకు గుడ్ బై చెప్పబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు.అయితే సునీల్ మాత్రం తనకు మంచి కామెడీ కథ ఉన్న పాత్రలు దొరికితే కామెడీ చేయడానికి కూడా తాను సిద్ధమేనని ఈయన తెలియజేశారు.

Advertisement
Has Sunil Said Goodbye To Comedian Roles Sunil Cant Laugh Anymore, Sunil ,comed
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

తాజా వార్తలు