వృద్ధుడికి వీల్ చైర్ అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బానోత్ రూప్ సింగ్ అనే వృద్ధుడికి అనారోగ్య కారణాల వలన కుడికాలు చికిత్స చేసి తొలగించారు.

అలాగే ఎడమకాలి బొటనవేలు మినహా అన్ని వేలు తొలగించగా, కలెక్టరేట్కు రావడం జరిగింది.

అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి పెన్షన్ రావడంలేదని సదరం సర్టిఫికెట్ రావడం లేదని పై అధికారులకు విన్నవించుకుందామని వచ్చామని తెలిపారు వెంటనే స్పందించిన జిల్లా యంత్రాంగం జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజ్యంకు తెలియజేయగా వెంటనే డిఆర్డిఏ సిబ్బందితో మాట్లాడి సదరం ఆప్పిల్ కు లేక తీసుకోవడం జరిగింది.అలాగే అతనికి కదలికలో సమస్య ఉన్నందున జిల్లా సంక్షేమ శాఖ తరపున వీల్ చైర్ అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుడు రూప్ సింగ్  చాలా సంతోషం వ్యక్తం చేశారు.తనకు పెన్షన్ రావడం లేదు దాని గురించి తెలుసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది.

ఆ సందర్భంలో నా పరిస్థితిని గమనించిన జిల్లా యంత్రాంగం జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజ్యం వీల్ చైర్ ని ఉదారంగా అందించింది కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలపడం జరిగింది.

Advertisement
సిరిసిల్ల ప్రభుత్వ స్కూల్ విద్యార్ధి హేమంత్ ప్రతిభకు గుర్తింపు

Latest Rajanna Sircilla News