నేటి నుండి నెల రోజులు పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు:డా.రవి నాయక్

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండల వ్యాప్తంగా నేటి నుండి నెల రోజుల పాటు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత టీకాల కార్యక్రమం ప్రారంభిస్తున్నామని మండల పశువైద్యాధికారి డా:రవి నాయక్ గురువారం పత్రిక ప్రకటనలో తెలిపారు.ఆవులు,గేదెలు,3 నెలల వయసు పైబడిన దూడలకు సామూహిక వ్యాధి నివారణ టీకాలు వేస్తామన్నారు.

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నేరేడుచర్ల మండల పశువైద్య సిబ్బంది 2 బృందాలుగా ఏర్పడి ఆయా గ్రామాల్లో 8500 పశువులకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు.

నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పశువుల యజమానులు మీ గ్రామానికి పశువైద్య సిబ్బంది వచ్చిన రోజు పశువులకు టీకాలు వేయించాలని కోరారు.

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

Latest Suryapet News