ఎన్గల్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో ఆదివారం వన్ హాస్పిటల్స్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి సభ్యులు కీర్తిశేషులు చీటి విజయ కుమార రావు జ్ఞాపకార్థం ఆయన కుమార్తె చీటి లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో భాగంగా గ్రామస్తులకు ఉచితంగా బి.

పి, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వైద్య శిబిరం నిర్వాహకురాలు డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ ఎన్గల్ గ్రామస్తులు వైద్యం చేయించుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చడంతో పాటు వారికి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గ్రామస్తులు ఎవరైనా, ఎప్పుడైనా, వారికి ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న కరీంనగర్ లోని తమ ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవచ్చని, అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించేందుకు తమ వైద్యులు సిద్ధంగా ఉన్నారని, తమ ఆసుపత్రిలో ఆయా కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ లు పని చేస్తాయని, క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉందని అన్నారు.ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.

సిరిసిల్ల ప్రభుత్వ స్కూల్ విద్యార్ధి హేమంత్ ప్రతిభకు గుర్తింపు
Advertisement

Latest Rajanna Sircilla News